Saakini Daakini Review: 'రెజీనా-నివేధా'ల శాకిని డాకిని మూవీ రివ్యూ

Saakini Daakini Movie Review in Telugu: రెజీనా-నివేధా ధామస్ జంటగా నటించిన శాకిని డాకిని మూవీ సెప్టెంబర్ 16న విడుదలైంది. ఆ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. 

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 16, 2022, 04:32 PM IST
Saakini Daakini Review: 'రెజీనా-నివేధా'ల శాకిని డాకిని మూవీ రివ్యూ

Saakini Daakini Movie Review in Telugu: ఇతర భాషలలో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాలను తెలుగులో రీమేక్ చేసే ట్రెండ్ ఎప్పటినుంచో ఉంది. ఈ మధ్యకాలంలో ఈ ట్రెండ్ బాగా పెరిగి పోయింది. కొరియాలో సూపర్ హిట్ గా నిలిచిన మిడ్ నైట్ రన్నర్స్ అనే సినిమాను తెలుగులో శాకిని డాకిని అనే పేరుతో రీమేక్ చేశారు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ సునీత తాటి అనే నిర్మాతగా కలిసి రీమేక్ చేయడమే కాక ఒరిజినల్ లో పురుషులు లీడ్ రోల్స్ చేయగా దాన్ని తెలుగులో ఇద్దరు అమ్మాయిలతో చేయించడం సినిమాపై మరింత ఆసక్తి రేకెత్తించింది. ఇక ఈ సినిమా మీద ప్రమోషన్స్ ఎంత ఆసక్తి పెంచాయో తెలియదు కానీ మగాళ్లు- మ్యాగీ రెండు నిమిషాలే అంటూ రెజీనా చేసిన కామెంట్లు ఈ సినిమా మీద ఒక్కసారిగా అందరి దృష్టి నిలిచేలా చేశాయి. మరి అంత ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందనేది రివ్యూలో చూద్దాం

శాకిని డాకిని కథ ఏమిటంటే:
శాలిని(నివేదా థామస్), దామిని(రెజీనా కసాండ్రా) ఇద్దరూ రెండు భిన్న పరిస్థితుల నుంచి వచ్చి తెలంగాణలో పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ క్యాడెట్లుగా చేరతారు. శాలినికి తన జీవితం మీద ఏ మాత్రం ఆసక్తి ఉండదు. భోజన ప్రియురాలైన ఆమె ఎంతసేపు తిండి మీదే దృష్టి పెడుతూ ఉంటుంది. దామిని మాత్రం తన తల్లిదండ్రులు పోలీస్ ఆఫీసర్లు కావడంతో తనను కూడా అనవసరంగా పోలీస్ డిపార్ట్మెంట్లో చేరుస్తున్నారనే భావనతో ఉంటుంది. ఎలాగైనా దాని నుంచి బయటపడి అమెరికాలో చదువుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇలాంటి రెండు భిన్న ధ్రువాల లాంటి వీరిద్దరికీ ఒకే రూమ్ వస్తుంది. తొలుత గొడవలు పడుతూ మొదలైన వీరి పరిచయం చివరికి మంచి స్నేహం ఏర్పడేలా చేస్తుంది. అలా స్నేహం కుదిరాక ఒకరోజు పబ్ కు వెళ్తారు. అక్కడి నుంచి తిరిగి వస్తున్న సమయంలో తమ కళ్ళముందే ఒక కిడ్నాప్ జరుగుతుంది. ట్రైనింగ్ లో ఇచ్చిన కొన్ని మెళకువలతో ఆ అమ్మాయిని కాపాడడానికి విశ్వ ప్రయత్నం చేసి విఫలం అవుతారు. మళ్ళీ పోలీస్ ట్రైనింగ్ అకాడమీ కి వచ్చి ఈసారి ట్రైనింగ్ తో పాటు బుర్రకు కూడా పదును పెట్టి ఎలా అయినా ఆ కిడ్నాప్ చేసిన ముఠాను పట్టుకోవాలని బయలుదేరుతారు. అలా బయలుదేరిన ఇద్దరూ కిడ్నాప్ ముఠాను పట్టుకున్నారా? అసలు ఆడపిల్లలే లక్ష్యంగా ఆ ముఠా అంతా కిడ్నాపులు ఎందుకు చేస్తున్నారు? అలా చేసిన వారిని ఏం చేస్తున్నారు? అనే విషయాలన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

విశ్లేషణ:
సాధారణంగా తెలుగులో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చాలా వచ్చాయి. అదే కోవలో ఈ సినిమా కూడా రూపొందింది. కాకపోతే కొరియాలో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాని తెలుగులో రీమిక్స్ చేస్తున్నారు.  కాబట్టి కాస్త ఎక్కువ ఏదైనా ఉంటుందేమో అని అనుకుంటే అది పొరపాటే ఎందుకంటే కేవలం కొరియా సినిమా నుంచి పాయింట్ మాత్రమే తీసుకొని దానిని ఇండియన్ నేటివిటీకి తగినట్లుగా సిద్ధం చేసుకున్నారు దర్శకుడు. మొదటి భాగం అంతా పాత్రల పరిచయానికే తీసుకున్న దర్శకుడు ఇంటర్వెల్ ప్లాట్ మాత్రం కాస్త ఆసక్తికరంగా రూపొందించాడు. రెండో భాగం మొదలైన తరువాత కథలో వేగం పెరుగుతుంది అనుకుంటే అది ఇంకా మందగించడం గమనార్హం. అసలు ఫస్ట్ ముగిసే సమయానికి సినిమా ముగిసిన ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుంది. రెండో భాగం మొదలైన తర్వాత ఎందుకో సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. చివరికి ఊహించిన విధంగానే సినిమా క్లైమాక్స్ కూడా ముగుస్తుంది. అంటే రీమేక్  కాబట్టి దానికి తగినట్లుగానే సిద్ధం చేసుకున్నాడు దర్శకుడు. కానీ ఇదంతా మనం ఎప్పటి నుంచో సినిమాల్లో చూస్తూ వస్తున్నదే. దీనికి పనికిరారు అనుకున్న వాళ్లు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఒక పెద్ద ఘనకార్యం చేయడం అందరూ వారి గొప్పతనాన్ని గుర్తించి వారిని మెచ్చుకోవడం అనే పాయింట్ మనం చాలా సినిమాల్లో చూసాము. దాన్ని ఈ సినిమాలో కూడా చూపించారు. కథలో కానీ కథనంలో కానీ ఎక్కడా కొత్తదనం అయితే కనిపించలేదు. ఒకానొక దశలో సహనానికి పరీక్ష పెడుతుందీ సినిమా.

నటీనటులు:
నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడుతూ అదరగొట్టింది శాలిని అలియాస్ నివేదా థామస్. నివేదా థామస్ అసలు పేరు మరిచిపోయి శాలిని అని గుర్తు పెట్టుకునేలా ఎలా ఆమె తన పాత్రలో జీవించింది. తిండిబోతు అమ్మాయిగా కనిపిస్తూ అదరగొట్టింది. రెజీనా మాత్రం ఎప్పటిలాగే తన పాత్రలో నటిస్తూ తన పాత్రకు న్యాయం చేసింది. నివేదా థామస్ నటనకు స్కోప్ దొరికింది కానీ రెజీనా మాత్రం ఎప్పటిలాగానే గిరి గిసుకొని అంతకుమించి యాక్ట్ చేయకూడదు అనుకుందో ఏమో తెలియదు కానీ రెజీనాను నివేదా థామస్ బాగా డామినేట్ చేసింది. ఇక సుదర్శన్, ఆర్జే హేమంత్ వంటి వారు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. కనిపించింది ఒకటి రెండు సీన్లు అయినా రఘుబాబు నవ్వించే ప్రయత్నం చేశారు.

ఇక టెక్నికల్ టీం విషయానికి
సినిమాకి దర్శకుడు సుధీర్ వర్మ ఏనా అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే సుధీర్ వర్మ గత సినిమాలు చూసిన వారు ఎవరైనా ఈ సినిమా మీద అంచనాలతో సినిమా ధియేటర్ కి వెళ్తాడు. కానీ సుధీర్ వర్మ మార్క్ ఏ మాత్రం కనిపించలేదు ఈ సినిమా విషయంలో. సుధీర్ వర్మ ఇన్పుట్స్ పక్కన పెట్టి మరో దర్శకుడితో సినిమా యూనిట్ కొన్ని మార్పులు చేర్పులు చేయించిందని పుకార్లు వచ్చాయి. బహుశా సినిమా చూసిన తర్వాత అది నిజమే అని అనిపిస్తుంది. అయితే ఒక కొరియన్ మూవీని ఇండియన్ నేటివిటికి తగినట్లు అడాప్ట్ చేయడం మాత్రం బాగా కుదిరింది. సినిమా మ్యూజిక్ ఏ మాత్రం సెట్ అవ్వలేదు. నేపథ్య సంగీతం కూడా సోసో గానే అనిపిస్తుంది. కానీ సినిమాటోగ్రఫీ సినిమాకి బాగా కుదిరింది.  అయితే సెకండ్ హాఫ్ లో ఎడిటర్ తన కత్తెరకు పని చెప్పి ఉంటే బయంత క్రిస్పీగా ఉండేదేమో. నిర్మాణ విలువలు సినిమాకు తగినట్టుగా ఉన్నాయి. 

ఓవరాల్ గా చెప్పాలంటే
థ్రిల్లర్ టైప్ అఫ్ మూవీస్ నచ్చేవారికి ఈ వీకెండ్ పర్ఫెక్ట్ ఛాయిస్ శాకినీ డాకినీ. పెద్దగా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఏమీ ఉండవు కానీ సరదాగా సాగుతూ ఉండే ఈ కథనాన్ని ఒకసారి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేయొచ్చు.
 Rating: 2.5/5

Also Read:  Nenu Meeku Baaga Kavalsinavaadini Review: కిరణ్ అబ్బవరం 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' మూవీ రివ్యూ

Also Read: Aa Ammayi Gurinchi Meeku Cheppali Review: సుధీర్ బాబు-కృతి శెట్టిల సినిమా ఎలా ఉందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News