Pranaya Godari: అలీ ఇంటి నుంచి హీరో.. ఫస్ట్ లుక్ పోస్టర్ చూశారా..!

Sadan Pranaya Godari Movie: సదన్, ప్రియాంక ప్రసాద్ జంటగా పీఎల్ విఘ్నేష్ జంటగా నటిస్తున్న మూవీ ప్రణయ గోదారి. ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను అంబర్‌పేట శంకరన్న ఆవిష్కరించి.. సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఆకాంక్షించారు.    

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 12, 2024, 06:35 PM IST
Pranaya Godari: అలీ ఇంటి నుంచి హీరో.. ఫస్ట్ లుక్ పోస్టర్ చూశారా..!

Sadan Pranaya Godari Movie: ప్రముఖ కమెడియన్ అలీ ఇంటి నుంచి హీరో ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు. అలీ సోదరుడి కుమారుడు సదన్ 'ప్రణయ గోదారి' అనే సినిమా ద్వారా పరిచయం కానున్నాడు. ఈ మూవీలో ప్రియాంక ప్రసాద్ హీరోయిన్‌గా నటిస్తోంది. పీఎల్‌వీ క్రియేషన్స్‌పై  పారమళ్ల లింగయ్య నిర్మిస్తుండగా.. పీఎల్ విఘ్నేష్ దర్శకత్వం వహించనున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్‌ను ప్రముఖ సంఘ సేవకులు అంబర్ పేట్ శంకరన్న రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్న సినిమాలకు సినీ పరిశ్రమలోని అందరూ అండగా నిలువాలని కోరారు. చిన్న చిత్రం అయినా.. మంచి కంటెంట్‌తో వస్తున్న ప్రణయ గోదారి మూవీ పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ప్రొడ్యూసర్‌గా పారమళ్ల లింగయ్యకు ఈ సినిమా ద్వారా సక్సెస్ దక్కాలని డబ్బులు కూడా మంచిగా రావాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

Also Read: Jr NTR: బాబు ప్రమాణ స్వీకారోత్సవానికీ  జూనియర్ ఎన్టీఆర్ ను పిలవలేదా..? పిలిచినా రాలేదా..?

అనంతరం ప్రొడ్యూసర్ పారమళ్ల లింగయ్య మాట్లాడుతూ.. తనకు ఎంతో ఇష్టమైన అంబర్ పేట్ శంకరన్న  ప్రణయ గోదారి సినిమా పోస్టర్‌ను రిలీజ్ చేయడం సంతోషంగా ఉందన్నారు. త్వరలోనే ఈ సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకువస్తామన్నారు. అందరూ ఈ సినిమాను ఆదరించి పెద్ద హిట్ చేయాలని కోరారు. ఈ చిత్రం ద్వారా ప్రముఖ హాస్య నటుడు అలీ సోదరుడి కుమారుడు సదన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారని.. ప్రియాంక ప్రసాద్  హీరోయిన్‌గా నటిస్తున్నట్లు చెప్పారు. సాయికుమార్, 30YRS పృథ్వి, జబర్దస్త్ రాజమౌళి, సునిల్ రావినూతల తదితరులు ఇతరల పాత్రల్లో నటిస్తున్నారని వెల్లడించారు. ఈ సినిమాకు మార్కండేయ సంగీతం అందిస్తుండగా.. ఈదర ప్రసాద్ కెమెరామెన్‌గా పనిచేస్తున్నారు. గోదావ‌రి బ్యాక్‌డ్రాప్‌లో బ్యూటీఫుల్ లవ్ స్టోరీగా తెలుస్తోంది.

అలీ కమెడియన్‌గానే కాకుండా పలు సినిమాల్లో హీరోగా కూడా నటించారు. య‌మ‌లీల‌, పిట్ట‌ల‌దొర‌ వంటి సినిమాలతో హిట్స్ కొట్టారు. అలీ సోదరుడు ఖయ్యూమ్‌ కూడా కమెడియన్‌గా నటించాడు. చిన్న సినిమాల్లో హీరోగా నటించినా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేయాడు.  
 
యాక్టర్స్: సదన్, ప్రియాంక ప్రసాద్, సాయికుమార్,30YRS పృథ్వి, జబర్దస్త్ రాజమౌళి, సునిల్ రావినూతల  తదితరులు

టెక్నీకల్ టీమ్

==> బ్యానర్ : పీఎల్‌వీ క్రియేషన్స్‌
==> ప్రొడ్యూసర్ : పారమళ్ళ లింగయ్య
==> డైరెక్టర్ : పీఎల్‌ విఘ్నేష్
==> మ్యూజిక్ డైరెక్టర్ : మార్కండేయ
==> కెమెరామెన్ : ఈదర ప్రసాద్
==> కొరియోగ్రాఫర్ : కళాధర్,మోహనకృష్ణ, రజిని
==> ఫైట్ మాస్టర్ : శంకర్ ,అహ్మద్
==> అస్టెంట్ డైరెక్టర్ : గంట శ్రీనివాస్
==> PRO: SR ప్రమోషన్స్ (సాయి సతీష్)

Also Read: బన్నీ బాబుకు బై బై చెప్పేస్తున్న మెగా హీరోలు.. చిచ్చు పెట్టిన ఆ ఒక్క తప్పు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News