'కరోనా వైరస్' దెబ్బ కారణంగా భారత ఆర్ధిక వ్యవస్థ కుదేలైంది. ఈ నేపథ్యంలో అన్ని రంగాలకు ఊతమిచ్చేలా 20 లక్షల కోట్ల రూపాయల ఉద్దీపన ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఐతే అందులో అంశాల వారీగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్ధిక ప్యాకేజీ ప్రకటిస్తున్నారు. ఇవాళ చివరి ఆర్ధిక ప్యాకేజీని ఆమె ప్రకటించారు. ఇందులో జాతీయ ఉపాధి హామీ పథకం, ఆరోగ్యం, విద్య, వాణిజ్య రంగాలకు పెద్దపీట వేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో సంస్కరణలు తీసుకొచ్చేందుకు మిషన్ మోడ్ లో పని చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు పని కల్పించేందుకు అదనంగా మరో 40 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ఆమె వివరించారు.
ప్రజారోగ్యాన్ని పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మరింత బలోపేతం చేస్తామన్నారు. అంతే కాకుండా ప్రతి జిల్లా కేంద్రంలో అంటు రోగాల కోసం ప్రత్యేకంగా ఓ విభాగాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రత్యేకంగా వ్యాధి నిర్ధారణ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని వివరించారు. పారామెడికల్ సిబ్బంది ఒక్కొక్కరికి 50 లక్షల బీమా వర్తింప చేస్తామని తెలిపారు. ఇందుకోసం రాష్ట్రాలకు 4 వేల 113 కోట్లు విడుదల చేసినట్లు ఆమె వివరించారు.
#WATCH Finance Minister Nirmala Sitharaman announces the last tranche of #EconomicPackage https://t.co/doq5YvOydo
— ANI (@ANI) May 17, 2020
దేశవ్యాప్తంగా వలస కార్మికుల కోసం ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయని.. తద్వారా వారిని స్వస్థలాలకు పంపిస్తున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందుకు అయ్యే ఖర్చులో 85 శాతం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. ఇంటర్నెట్ అందుబాటులో లేని విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు ప్రత్యేకంగా 12 డీటీహెచ్ ఛానెళ్లు అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు. స్వయంప్రభ పేరుతో ఆయా ఛానెళ్లను ఉచితంగా విద్యార్థులు చూసి పాఠాలు నేర్చుకోవచ్చని చెప్పారు. దేశవ్యాప్తంగా వెయ్యి యూనివర్శిటీలు ఆన్ లైన్ లో తరగతులు నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చామని తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
చివరి ఆర్ధిక ప్యాకేజీ.. ఇదిగో ఇలా..!!