ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ( corona virus )   విజృంభిస్తోంది. ముఖ్యంగా భారతదేశంలో కోవిడ్ 19  ( Covid 19 ) మహమ్మారి తన పంజా విసురుతోంది. వ్యాక్సీన్ కు ఇంకా సమయం పట్టనుండటంతో అందరి దృష్టీ ప్లాస్మా థెరపీ( Plasma Therapy )  పై పడింది. దేశంలో తొలి ప్లాస్మా బ్యాంకును  ఢిల్లీలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ( Delhi cm kejriwal )  ప్రారంభించడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అసలు ప్లాస్మా బ్యాంకు ఎలా ఉంటుంది ? ఎవరు ప్లాస్మా దానానికి అర్హులు ? అనేది ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


వాస్తవానికి ప్లాస్మా థెరపీ అనేది కొత్తగా కొనుగొన్న విదానం కానేకాదు. చాలాకాలంగా వివిధ సందర్భాల్లో వివిధ రుగ్మతల్లో వాడుకలో ఉన్నదే. మరి హఠాత్తుగా కోవిడ్ 19 వైరస్ విషయంలో ఎందుకింత ప్రాధాన్యత ఏర్పడింది. ఇది తెలుసుకోవాలంటే అసలు ప్లాస్మా థెరపీ అంటే ఏంటి..దాని పుట్టుపూర్వోత్తరాలేంటనేది తెలుసుకోవాలి. Also read: Corona virus: కోవిడ్ 19 నివారణకు రాష్ట్రాలకు కేంద్రం తాజా సూచనలు


ప్లాస్మా థెరపీ చరిత్ర:


ఈ థెరపీ 1800 సంవత్సరం నుంచి వాడుకలో ఉన్నట్టు ఆధారాలున్నాయి. డిప్తీరియాకు చికిత్స అందించే క్రమంలో తొలిసారిగా ఈ థెరపీను 1892లో వినియోగించారు. డిప్తీరియా సోకిన జంతువుల్నించి అప్పట్లో సేకరించారు. తరువాతక 1920లో స్కార్లెట్ ఫీవర్ కు చికిత్స అందించేందుకు ప్లాస్మా థెరపీను ఉపయోగించారు. పెర్టూసిస్ ( pertussis ) చికిత్స లో మాత్రం 1970 వరకూ వినియోగించారు. ఇక ప్రపంచాన్ని సవాలు చేయడమే కాకుండా గజగజలాడించిన స్పానిష్ ఇన్ ఫ్లూయెంజా మహమ్మారి (  Spanish influenza pandemic ) చికిత్సలో  ఈ థెరపీ మిశ్రమ ఫలితాలనిచ్చింది.తరువాత 2014లో ఎబోలా ( Ebola virus ) చికిత్సలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు మేరకు వినియోగించారు. మరోవైపు 2003లో తలెత్తిన సార్స్ ( SARS ) , 2009లో చూసిన హెచ్ 1ఎన్ 1 ( H1N1)  చికిత్సలో ప్లాస్మా థెరపీను వినియోగించారు. 


ఇప్పుడు తాజాగా కరోనా వైరస్ మహమ్మారిని కట్టిడి చేయడంలో ఈ వైరస్ కు చికిత్సను అందించడంలో ఇదే థెరపీను అమలు చేయవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐసీఎంఆర్ , ప్రపంచంలోని అగ్రదేశాల ఆరోగ్య సంస్థలు సూచించడంతో దీనికి మరోసారి ప్రాధాన్యత ఏర్పడింది. Also read: Fighter jets: యుద్ధవిమానాల కొనుగోలుకు పచ్చజెండా


ప్లాస్మా థెరపీ అంటే: 


ప్లాస్మా థెరపీ అంటే ఏ వ్యాధి చికిత్సకు దీన్ని వాడదల్చుకున్నామో ఆ వ్యాధి సోకి కోలుకున్న వ్యక్తి నుంచి రక్తాన్ని సేకరిస్తారు. సేకరించిన రక్తంలో నుంచి ప్లాస్మా కణాల్ని వేరు చేసి భద్రపరుస్తారు. ఈ ప్లాస్మా కణాల్ని వ్యాధి సోకిన మరో వ్యక్తికి చికిత్స సందర్బంగా ఎక్కిస్తారు. ఇదే ప్లాస్మా థెరపీ.  వైరస్ సోకి కోలుకున్న మనిషి శరీరంలో  అదే వైరస్ కు వ్యతిరేకంగా యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయి. ఇవి ఆ వైరస్ తిరిగి ప్రవేశించకుండా నిరోధిస్తాయి. ఇదే ఈ థెరపీలో ప్రదాన సూత్రం.


ప్లాస్మా ఎవరు దానం చేయవచ్చు:


కోవిడ్19 వైరస్ సోకిన తరువాత ఆ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుని...తిరిగి 14 రోజుల వరకూ ఎటువంటి వ్యాధి లక్షణాలు లేకపోతే ఆ వ్యక్తి తన ప్లాస్మాను దానం చేయవచ్చు. 18-60 ఏళ్ల లోపు వయస్సుండి...50 కిలోల కంటే ఎక్కువ బరువు ఉండాలి ప్లాస్మా దానం చేసే వ్యక్తి. 


ప్లాస్మా దానం ఎవరు చేయకూడదు:


డయాబెటిస్, ఇన్సులిన్ , క్యాన్సర్, గుండె, ఊపిరితిత్తుల సమస్యలు , కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నవారు, గర్భిణీలు ప్లాస్మా దానానికి అనర్హులని ఐసీఎంఆర్ సూచించింది. అంతేకాకుండా ఓ వ్యక్తి బీపీ 140 కంటే ఎక్కువగా. డయాస్టోలిక్  60 కంటే తక్కువ..90 కంటే ఎక్కువగా ఉంటే సదరు వ్యక్తి ప్లాస్మా దానం చేయకూడదు. 


ఢిల్లీలో నెలకొల్పిన దేశంలోని తొలి ప్లాస్మా బ్యాంకుకు ( Indias first plasma bank )  ప్లాస్మాను దానం చేయాలనుకునే వ్యక్తుల కోసం కొన్ని నెంబర్లను కేటాయించారు. 1031 కు కాల్ చేయడం ద్వారా లేదా 8800007722 కు వాట్సప్ చేయడం ద్వారా ప్లాస్మా దానానికి పేరు నమోదు చేసుకోవచ్చు. ప్లాస్మా దానం వల్ల మనిషి బలహీనపడే అవకాశాలు ఏ మాత్రం లేవు. Also read: Russia: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో మోదీ


ప్రభుత్వం తరపున సదుపాయాలు:


ప్లాస్మా దాత ముందుగా ఐఎల్ బీఎస్ ( ILBS ) ఆస్పత్రికి రావల్సి ఉంటుంది. ప్రయాణ ఖర్చుల్ని ప్రభుత్వమే భరిస్తుంది. ప్లాస్మా దాతకు ( Plasma donor )  మరోసారి ప్రభుత్వం పరీక్షలు చేస్తుంది. ప్లాస్మా దాతకు అన్ని సదుపాయాలు కల్పించడమే కాకుండా...సదరు దాతకు ప్లాస్మా డోనర్ సర్టిఫికేట్ అందిస్తుంది ఢిల్లీ ప్రభుత్వం. 


విధి విధానాలు:


కరోనా వైరస్ నుంచి కోలుకున్న వ్యక్తి ప్లాస్మాలో అత్యంత బలమైన యాంటీ బాడీస్ వృద్ధి చెంది ఉంటాయి. ఇవి కరోనా కట్టడికి తోడ్పడతాయి. ప్లాస్మాను సేకరించే విషయంలో ఐసీఎంఆర్ (ICMR) గైడ్ లైన్స్ స్పష్టంగా ఉన్నాయి. ముందుగా ప్లాస్మా దాతకు యాంటీ బాడీ స్క్రీనింగ్ నిర్వహిస్తారు. దీని ద్వారా ఆ వ్యక్తి శరీరంలో యాంటీబాడీస్ ఏ స్థాయిలో ఉన్నాయనేది తెలుస్తుంది. సరిపడినంత యాంటీ బాడీస్ ఉన్నాయని నిర్ధారించుకున్న  తరువాతే ఆ దాత నుంచి ప్లాస్మాను సేకరిస్తారు. Also read: Postal Ballot Voting: 65 ఏళ్లు పైబడిన వారికి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సదుపాయం