కోవిడ్ 19 వైరస్ సంక్రమణను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం తాజా సూచనలు జారీ చేసింది. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్ని ముమ్మరం చేయాలని..ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం అర్హులైన వారంతా కరోనా పరీక్షల్ని ప్రిస్ క్రైబ్ చేయవచ్చని తెలిపింది.
కరోనా మహమ్మారిని ముందుస్తుగా గుర్తించేందుకు వీలుగా కోవిడ్ 19 నిర్దారణ పరీక్షల్ని ముమ్మరం చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు విజ్ఞప్తి చేసింది. ఇందులోో భాగంగా..ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం అర్హులైన క్వాలిఫైడ్, ప్రైవేట్ ప్రాక్టీషనర్లు సైతం కరోనా నిర్ధారణ పరీక్షలకు ప్రెస్ క్రైబ్ చేయవచ్చని సూచించింది. కరోనా సంక్రమణను కట్టడి చేసే క్రమంలో భాగంగా వీలైన అన్ని వైద్యావకాశాల్ని వినియోగించుకునే క్రమంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఉన్న అడ్డంకుల్ని తొలగించేందుకు ఆరోగ్య శాఖ, ఐసీఎంఆర్ ఈ తాజా గైడ్ లైన్స్ జారీ చేశాయి. దీని ప్రకారం టెస్ట్ ట్రాక్ ట్రీట్ ( Test, Track, Treat ) వ్యూహాన్ని అవలంభించనున్నామన్నారు. అర్హత ఉంటే ప్రతి ఒక్కరూ కోవిడ్ 19 పరీక్షలకు ప్రెస్ క్రైబ్ చేయవచ్చన్నది తాజా గైడ్ లైన్స్ సారాంశం. Also read: Coronavirus medicine: కరోనిల్ మెడిసిన్‌పై మరో ట్విస్ట్
ముందస్తగా గుర్తించడం కోసం ఇకపై ల్యాబరేటరీలు ఎవ్వరికైనా సరే కోవిడ్ 19 నిర్ధారణ పరీక్షలు చేయవచ్చని ఐసీఎంఆర్ సూచిస్తోంది. కరోనా సంక్రమణను కట్టడి చేసేందుకు ఈ విధానం ఉపయోగకరంగా ఉంటుందనేది ఐసీఎంఆర్ ఆలోచనగా ఉంది. ఐసీఎంఆర్ ఇప్పటివరకూ 1 వేయి 56 ల్యాబరేటరీలకు కోవిడ్ 19 నిర్ధారణ పరీక్షలు చేసేందుకు అనుమతిచ్చింది. ఇందులో 764 ప్రభుత్వరంగంలోనివి కాగా..292 ప్రైవేట్ రంగానికి చెందినవి. పరీక్షల సామర్ధ్యాన్ని పెంచేందుకు ప్రత్యేక శిబిరాల ఏర్పాటు, మొబైల్ వ్యాన్ ల వ్యవస్థతో లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేసేలా రాష్ట్ర , కేంద్ర పాలిత ప్రాంతాలు చర్యలు తీసుకోవాలని ఐసీఎంఆర్ సూచించింది. Also read: Tiktok: దేశానికి వ్యతిరేకంగా వాదించను: మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ