రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో భారత ప్రధాని నరేంద్రమోదీ ఫోన్ లో సంప్రదింపులు జరిపారు. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు...గ్లోబల్ సమస్యలపై నేతలిద్దరూ చర్చించారు. రెండు దేశాల నేతల చర్చల్లో చైనా ప్రస్తావన వచ్చినట్టు సమాచారం. అసలు మోదీ-పుతిన్ ల మద్య ఏం సంభాషణ జరిగింది. చైనాతో తలెత్తిన వివాదం చర్చకొచ్చిందా...
రెండో ప్రపంచయుద్ధంలో విజయం సాధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్బంగా అభినందనలు తెలిపేందుకు ప్రదాని మోదీ..రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో ఫోన్ లో మాట్లాడారు. రష్యాలోని రాజ్యాంగ సవరణలపై ఓటింగ్ విజయవంతంగా పూర్తయినందుకు కూడా శుభాకాంక్షలు అందించారు. భారత-రష్యా స్నేహానికి సంకేతంగా జూన్ 24న రష్యాలో జరిగిన సైనిక కవాతులో భారతీయ బృందం పాల్గొనడాన్ని ఈ సందర్బంగా మోదీ గుర్తు చేశారు. రెండుదేశాల ద్వైపాక్షిక సంబంధాలతో పాటు...ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన సమస్యలపై చర్చించుకున్నారు. ముఖ్యంగా చైనాతో నెలకొన్న వివాదం ప్రసావన చర్చల్లో వచ్చినట్టు తెలుస్తోంది. Also read: China Dispute: భారత్ తోనే కాదు..18 దేశాలతో చైనాకు వివాదం
అటు కోవిడ్ 19 వైరస్ తో ఎదురవుతున్న ప్రతికూల ప్రభావాన్ని అధిగమించేందుకు చేపట్టిన చర్యలపై మోదీ-పుతిన్ లు సమీక్షించారు. దీనికోసం రెండు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఏడాది చివర్లో భారత్ లో జరగాల్సిన 21 వ ద్వైపాక్షిక సదస్సు కోసం సంప్రదింపుల్ని వేగవంతం చేయాలని ఇరువురూ నిర్ణయించారు. ఈ సదస్సుకు రావల్సిందిగా పుతిన్ ను మోదీ ఆహ్వానించారు. అన్ని రంగాల్లోనూ రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్య అవసరంపై చర్చించారు. గ్లోబల్ సెక్యూరిటీ, శాంతిని నెలకొల్పడంపై రెండు దేశాల మద్య ఉన్న సారూప్యత గురించి సంభాషణ సాగింది. ప్రాంతీయ, ప్రపంచస్థాయి విషయాలపై ఇరుదేశాల నేతలు అభిప్రాయాల్ని పంచుకున్నారు. ఈ సందర్బంలోనే చైనా ప్రస్తావన వచ్చినట్టు తెలుస్తోంది. చైనా సమస్యపై ఇరువురు దేశాల నేతలు సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. Also read: Russian victory day parade: రష్యన్ విక్టరీ డే పేరేడ్‌లో ఇండియా దేనికి సంకేతం ?
చైనాతో వివాదంపై చర్చ ?
కోవిడ్ 19 వైరస్ సంక్రమణ నేపధ్యంలో ఇరుదేశాలు తీసుకున్న చర్యల గురించి ప్రస్తావిస్తూనే...రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత సన్నిహితం కావల్సిన అవసరం గురించి మోదీ-పుతిన్ లు చర్చించుకున్నారు. రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా మోదీ అంకితభావాన్ని పుతిన్ ఈ సందర్బంగా ప్రశంసించారు. చైనాతో తలెత్తిన సరిహద్దు వివాదంపై ఇరుదేశాల నేతల మధ్య కొన్ని కీలకమైన విషయాలు చర్చకొచ్చినట్టు సమాచారం.
Russia: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో మోదీ