Postal Ballot Voting: 65 ఏళ్లు పైబడిన వారికి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సదుపాయం

గతంలో ఈ సదుపాయం కేవలం 80 ( Aged Above 80 Years ) సంవత్సరాలకు పైబడి వారితో పాటు, ఇతర రాష్ట్రాల్లో అత్యవసర సేవల్లో ఉన్న ఉద్యోగులు, ఎలక్షన్ డ్యూటీలో ( Election Duties ) ఉన్న వారు మాత్రమే వినియోగించుకునే వారు.  **

Last Updated : Jul 2, 2020, 10:05 PM IST
Postal Ballot Voting: 65 ఏళ్లు పైబడిన వారికి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సదుపాయం

Election Commission Of India : కేంద్ర ఎన్నికల సంఘం ( ECI ) కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న ఎన్నికల్లో 65 ఏళ్లు పైబడిన వారికి పోస్టల్ బ్యాలెట్ (Postal Ballot Voting ) ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించింది. త్వరలో ఉత్తర భారత దేశంలో జరిగే ఎన్నికల్లో ఈ సదుపాయాన్ని సీనియర్ సిటిజన్లు ( Seniro Citizens Of India ) వినియోగించుకోనున్నారు. 

Read Also : WhatsApp: సరికొత్త 5 ఫీచర్లతో వాట్సప్ మీ ముందుకు 

కరోనా సంక్షోభం ( Covid 19) మధ్య త్వరలో జరగబోయే బీహార్ శాసనసభ ఎన్నికల కోసం నేషనల్ ఎలక్షన్ కమిషన్ ( NCI ) కొత్త విధివిధాలనాలను రూపొందించింది.

కరోనా వైరస్ ( Coronavirus ) ప్రభావం వయోవృద్ధులపై ( Aged Persons ) అధికం ఉండంటంతో ఎన్నికల కమిషన్ (Election Commission Of India  )ఈ మేర నిర్ణయం తీసుకుంది.  మధుమేహం, గుండె సంబంధిత సమస్యలతో పాటు బ్లడ్ ప్రెషర్ ఉన్న వారితో పాటు, గర్భిణి స్త్రీలు బయటికి వచ్చే పరిస్థితి లేదు. వీరికి పోస్టల్ బ్యాలెట్ ఉపయోగపడనుంది.  Also Read : Lunar Eclipse July 2020 : జూలై 5న చంద్రగ్రహణం విశేషాలివే

త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఇకపై 65 సంవత్సరాలకు పైబడి వయసు ఉన్నవారు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. గతంలో ఈ సదుపాయం కేవలం 80 ( Aged Above 80 Years ) సంవత్సరాలకు పైబడి వారితో పాటు, ఇతర రాష్ట్రాల్లో అత్యవసర సేవల్లో ఉన్న ఉద్యోగులు, ఎలక్షన్ డ్యూటీలో ( Election Duties ) ఉన్న వారు మాత్రమే వినియోగించుకునే వారు. 

Trending News