Stress Increasing Foods: స్ట్రెస్ ని పెంచే ఆహార పదార్థాలు ఇవే.. తస్మాత్ జాగ్రత్త!

Stress: కొన్ని ఆహారపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మనకి ఒత్తిడి పెరుగుతుంది అని మీకు తెలుసా.. మీరు విన్నది నిజమే.. మనం తీసుకునే ఆహారమే మన శరీర మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అలాగే మనం తీసుకునే కొన్ని ఆహార పదార్థాలు ఒత్తిడిని ఇంకా పెంచే విధంగా ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 24, 2024, 09:25 PM IST
Stress Increasing Foods: స్ట్రెస్ ని పెంచే ఆహార పదార్థాలు ఇవే.. తస్మాత్ జాగ్రత్త!

Foods to avoid: ఈమధ్య కాలంలో అందరిదీ ఉరుకుల పరుగుల జీవితం అయిపోయింది. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే దాకా క్షణం కూడా తీరిక లేకుండా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే చాలామంది ఏదో ఆకలి తీర్చుకోవడానికి తింటున్నారు కానీ మనం తినే ఆహారం నుంచి మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతున్నాయా లేదా అని మాత్రం ఆలోచించడం లేదు.

ఇలా ఆలోచించకుండా ప్యాక్డ్ ఫుడ్, ఇన్స్టాంట్ ఫుడ్ వంటివి ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యం పాడైపోతూ ఉంటుంది. ఒకవైపు ఇల్లు మరో వైపు ఆఫీసు పనులతోనే ఒత్తిడి పెరిగిపోతూ ఉంటే మరోవైపు మనం తింటున్న ఆహారం కూడా మన మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. తెలియకుండా మనం తినే కొన్ని ఆహార పదార్థాల కారణంగా కూడా ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. 

మనం తీసుకునే కొన్ని ఆహార పదార్థాలు మనల్ని ఇంకా ఒత్తిడికి గురయ్యేలా చేస్తూ ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం. 

చక్కెర :

ఉదయం లేచిన దగ్గర్నుంచి టీ లోను కాఫీ లోను, జ్యూస్ లోను ఏదో ఒక విధంగా చక్కెర మన శరీరంలోకి వెళుతూనే ఉంటుంది. అది రక్తంలో ఉండే గ్లూకోస్ లెవెల్స్ ని బాగా పెరిగి పోయేలా చేస్తుంది. కొన్నిసార్లు చక్కర స్థాయి ఎక్కువ అయిపోయినప్పుడు కూడా మానసిక ఒత్తిడి పెరుగుతుంది. దీర్ఘకాలికంగా చక్కెర ఎక్కువగా వినియోగిస్తే షుగర్, రక్తపోటు, అధిక బరువు వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. 

కెఫీన్ :

టీ, కాఫీ వంటి పానీయాలలో మాత్రమే కాక కార్బోనేటెడ్ డ్రింక్స్ లో కూడా కెఫీన్ స్థాయి ఎక్కువగా ఉంటుంది. వాటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరంలో ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఒత్తిడిని నియంత్రించే కార్టీ సాల్ హార్మోన్ లు పెరగడం మాత్రమే కాక అడ్రినల్ గ్రంధులకి కూడా ఇబ్బంది కలుగుతుంది. నాడీ వ్యవస్థ పై కూడా కెఫిన్ చెడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అధిక మొత్తంలో కెఫీన్ తీసుకోవడం ఏ మాత్రం మంచిది కాదు.

ఫ్రైడ్‌ ఫుడ్‌ :

నూనెలో వేయించిన పదార్థాలు కూడా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఫాస్ట్ ఫుడ్ జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. కానీ దానివల్ల ట్రాన్స్ ఫ్యాట్ పెరిగిపోతూ ఉంటుంది. ఒబెసిటీ ఉన్నవాళ్లు ఇలాంటి ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల హృదయనాళ వ్యవస్థ కూడా దెబ్బతిని శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. క్రమంగా అదే మానసిక ఆరోగ్యాన్ని కూడా పాడుచేస్తుంది. ఒత్తిడి బాగా పెరిగిపోయేలాగా చేస్తుంది. 

రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు :

ఎంత మంచి ఆహార పదార్థాలలో ఉండే ఫైబర్, విటమిన్లు, పోషకాలు అన్ని రిఫైన్ చేస్తే తొలగిపోతాయి. పాలిష్‌డ్ బియ్యం, పాస్తా, వైట్‌ బ్రెడ్‌, కూల్‌ డ్రింక్స్‌ వంటి ఆహార పదార్థాలలో రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. వాటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మన రక్తంలో గ్లూకోజ్‌ స్థాయు కూడా బాగా పెరుగుతుంది అని నిపుణులు చెబుతున్నారు.

ఆర్టిఫీషియల్ స్వీటనర్లు:

ఈ మధ్యకాలంలో డయాబెటిస్ ఒబిసిటీ వంటి చాలా ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి అంటే దానికి ముఖ్య కారణం ఆర్టిఫిషియల్ స్వీటనర్లు. వీటిని ఉపయోగించడం వల్ల కూడా మన మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఒత్తిడి బాగా పెరుగుతుంది.

కాబట్టి ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే మన మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఒత్తిడి, యాంగ్సైటి వంటివి మన వద్దకు రాకుండా ఉంటాయి.

Also Read: Thunderbolt: అమ్మమ్మ ఇంట్లో విషాదం.. క్రికెట్‌ ఆడుతున్న యువకుడిని బలిగొన్న పిడుగు

Also Read: Brutally Murder: తెలంగాణలో మరో రాజకీయ హత్య.. మంచంపై పడుకున్న నాయకుడిపై క్రూరంగా దాడి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News