Natural Home Remedies For Hair Fall: వాతావరణం లో కాలుష్యం పెరగడం కారణంగా చాలామందిలో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ అనారోగ్య సమస్యల్లో చర్మ జుట్టు సమస్యలు ప్రధానమైనవి. వాతావరణంలో తేమ అధికం అవ్వడం వల్ల జుట్టు సమస్యలు వస్తున్నాయి. దీని కారణంగా జుట్టు చివరి భాగాన చిట్లిపోయి అంద హీనంగా తయారవుతుంది. అంతేకాకుండా మరికొందరిలో పొడి జుట్టు గా మారి.. జుట్టు రాలిపోతుంది.
ఎండ, దుమ్ము, మట్టి జుట్టుపై పడడం వల్ల చివరి భాగాల్లో మురికి పేరుకుపోయి చుండ్రుతో పాటు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా సహజమైన ప్రొడక్ట్స్ ని వినియోగించాల్సి ఉంటుంది. వీటిని వినియోగించడం వల్ల జుట్టు బలంగా మారి చిట్లిపోకుండా తయారవుతుంది. ప్రముఖ సౌందర్య నిపుణులు తెలిపిన సహజమైన హెయిర్ మాస్కులను వినియోగించడం వల్ల కూడా ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది.
అంతేకాకుండా చాలామంది ప్రస్తుతం ఆధునిక జీవన శైలి కారణంగా జుట్టును స్టైల్ గా చేసుకోవడానికి రసాయనాలతో కూడిన ప్రొడక్ట్స్ వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించడం వల్ల కూడా జుట్టు చివరి భాగాలు దెబ్బతింటాయని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి జుట్టు సమస్యలతో బాధపడుతున్న వారు ఈ రసాయనాలతో కూడిన ప్రొడక్ట్స్ ను వినియోగించకపోవడం చాలా మంచిదని సూచిస్తున్నారు.
Also Read: Shaakuntalam OTT Release: నెల తిరక్కుండానే ఓటీటీలోకి శాకుంతలం.. ఎందులో? ఎప్పుడు రిలీజ్ అంటే?
ఎగ్ హెయిర్ మాస్క్:
ఎగ్ హెయిర్ మాస్క్ చుట్టూ బలంగా చేసేందుకు సహాయపడుతుంది కాబట్టి జుట్టు సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ హెయిర్ మాస్క్ ను వినియోగించాల్సి ఉంటుంది. అయితే దీనిని ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. ముందుగా ఒక బౌల్ తీసుకొని.. రెండు కోడిగుడ్ల పచ్చ సోనాను ఆ బౌల్లో వేసుకోవాలి. ఆ తర్వాత అందులో రెండు టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్, బాదాం నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత జుట్టుకు అప్లై చేసుకొని 40 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే త్వరలోనే మంచి ఫలితాలు పొందుతారు.
బనానా హెయిర్ మాస్క్:
బనానా లో కూడా జుట్టుకు కావాల్సిన చాలా రకాల పోషక విలువలు లభిస్తాయి. కాబట్టి దీనిని కూడా హెయిర్ మాస్క్ గా వినియోగించవచ్చని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. ఈ హెయిర్ మాస్కులు తయారు చేయడానికి ముందుగా అరటి పండ్లను మిశ్రమంగా తయారు చేసుకోవాలి. అందులో ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకొని జుట్టుకు పట్టిస్తే.. జుట్టు చివర్ల భాగాలు దెబ్బతినకుండా ఉంటాయి. అంతేకాకుండా జుట్టు నిగనిగల ఆడుతుంది.
Also Read: Shaakuntalam OTT Release: నెల తిరక్కుండానే ఓటీటీలోకి శాకుంతలం.. ఎందులో? ఎప్పుడు రిలీజ్ అంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook