Fixed Deposit Rates: బ్యాంక్ ఖాతాదారులకు ఊరటనిస్తూ ఇటీవల ఆర్బీఐ రెపో రేటు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం ఉన్న 6.50 శాతం వద్ద రెపో రేటును కొనసాగించింది. గతేడాది మే నుంచి వరుసగా ఆరుసార్లు రెపో రేటును పెంచిన విషయం తెలిసిందే. ఇక ఏయే బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎంత వడ్డీ రేటును అందిస్తున్నాయో ఓ లుక్కేయండి.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఐదు సంవత్సరాల ఒక రోజు నుంచి 10 సంవత్సరాల మధ్య మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీని అందిస్తోంది. ఇతర ఖాతాదారులకు అదే కాలానికి 7 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది.
ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు భారీ వడ్డీ రేటును అందిస్తోంది. వెయ్యి రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఎఫ్డీలపై 9.01 శాతం వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది. ఇతర ఖాతాదారులకు అదేకాలానికి వడ్డీ రేటు 8.41 శాతం నిర్ణయించింది.
యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అన్ని బ్యాంక్‌ల కంటే వడ్డీ రేట్‌ను అందిస్తోంది. సీనియర్ సిటిజన్లు 1001 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్లపై 9.50 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఇతరులకు అదే కాలవ్యవధికి వడ్డీ రేటు 9 శాతంగా ఉంది.
ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 700 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 9 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఇతర ఖాతాదారులకు అదే కాలవ్యవధికికి 8.25 శాతం వడ్డీరేటు ఉంది.
ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 888 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఎఫ్డీలపై సీనియర్ సిటిజన్లకు 9 శాతం వడ్డీని అందిస్తోంది. మిగిలిన డిపాజిటర్లకు ఇదే కాలానికి 8.5 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది.
అమృత్ కలాష్ స్పెషల్ ఎఫ్డీ స్కీమ్ గడువును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ 30వ తేదీ వరకు పొడిగించింది. ఈ పథకంలో 400 రోజుల ఎఫ్డీపై 7.10 శాతం వడ్డీని అందిస్తోంది. ఇదే స్కీమ్‌లో సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది.