ఇండియాలో వివో స్మార్ట్ ఫోన్ యూజర్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న స్మార్ట్ ఫోన్స్‌లో వివో ఎక్స్90 ప్రో ఫోన్ ఒకటి. ఇవాళే ఈ ఫ్లాగ్షిప్ రేంజ్ స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది. ఈ ఫోన్లో చెప్పుకోదగిన ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి. చెప్పుకోదగిన ఆ ప్రత్యేకతలు ఏంటి ? ఎందుకు ఈ ఫోన్ కోసం కస్టమర్స్ అంతలా ఎదురుచూస్తున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం రండి.
Vivo X90 Pro 5G Phone: ఇండియాలో వివో స్మార్ట్ ఫోన్ యూజర్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న స్మార్ట్ ఫోన్స్‌లో వివో ఎక్స్90 ప్రో ఫోన్ ఒకటి. ఇవాళే ఈ ఫ్లాగ్షిప్ రేంజ్ స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది. ఈ ఫోన్లో చెప్పుకోదగిన ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి. చెప్పుకోదగిన ఆ ప్రత్యేకతలు ఏంటి ? ఎందుకు ఈ ఫోన్ కోసం కస్టమర్స్ అంతలా ఎదురుచూస్తున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం రండి.
Vivo X90 Pro 5G Phone: ఏప్రిల్ 26న ఇండియాలో లాంచ్ అయిన ఈ ఫ్లాగ్షిప్ రేంజ్ స్మార్ట్ ఫోన్ అయిన వివో ఎక్స్90 ప్రో ఫోన్ మే 5న మధ్యాహ్నం 12 గంటల నుంచి విక్రయానికి అందుబాటులోకి రానుంది.
Vivo X90 Pro 5G Phone: వివో ఎక్స్90 ప్రో ఫోన్ స్మార్ట్ ఫీచర్స్‌లో మొట్టమొదటిగా చెప్పుకోదగినది ఈ ఫోన్ కెమెరా లెన్స్. అవును, వివో ఎక్స్90 ప్రో మెయిన్ కెమెరా కోసం జర్మనీకి చెందిన జీస్ (ZEISS) లెన్స్ ఉపయోగించారు. ఆప్టికల్ సొల్యూషన్స్‌లో, లెన్స్ పిక్చర్ క్వాలిటీలో జీస్ వరల్డ్ లీడర్ అనే విషయం తెలిసిందే. పైగా డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీతో ఈ పోన్ రూపొందినట్టు తెలుస్తోంది.
Vivo X90 Pro 5G Phone: వివో ఎక్స్90 ప్రో ఫోన్ ఖరీదు రూ. 84,999 గా ఫిక్స్ చేయగా 12GB + 256GB స్టోరేజీ వేరియంట్‌పై 5 శాతం డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ వేరియంట్లో కేవలం లెజెండరీ బ్లాక్ కలర్ ఆప్షన్లో మాత్రమే ఫోన్ లభిస్తోంది.
Vivo X90 Pro 5G Phone: ఫ్లాగ్షిప్ ఫోన్ అనుభవం పొందడం కోసం ఈ ఫోన్ ని మీడియా టెక్ డైమెన్సిటీ 9200, ప్రో ఇమేజింగ్ చిప్ వి2 తో రూపొందించారు.
Vivo X90 Pro 5G Phone: వివో ఎక్స్90 ప్రో ఫోన్ కెమెరా సెటప్‌లో వెనుక భాగంలో 12MP వైడ్ యాంగిల్ కెమెరా, 50 MP పోట్రేట్ కెమెరా లార్జ్ సెన్సార్, లేజర్ ఫోకస్ సెన్సార్‌తో 50MP జీస్ 1 ఇంచ్ మెయిన్ కెమెరా ఉన్నాయి. అలాగే అందమైన సెల్ఫీల కోసం ముందు భాగంగా 32 MP సెల్ఫీ కెమెరాను అమర్చారు.
Vivo X90 Pro 5G Phone: వివో ఎక్స్90 ప్రో ఫోన్లోని అద్భుతమైన ఫీచర్స్‌కి సపోర్ట్ చేసేలా, నాన్-స్టాప్ ఎంటర్టైన్మెంట్ కోసం శక్తివంతమైన 4870 mAH బ్యాటరీని అమర్చారు. బ్యాటరీని వేగంగా చార్జింగ్ చేసేలా 120 w డ్యూయల్-సెల్ ఫ్లాష్ చార్జ్ సౌకర్యం ఉంది.
Vivo X90 Pro 5G Phone: 6.87 అంగుళాల అమోల్డ్ డిస్ప్లే కలిగిన ఈ ఫోన్ కంటి చూపుపై ప్రభావం పడకుండా హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ స్థాయిల్లో స్మార్ట్ ఐ ప్రొటెక్షన్ మోడ్ కోసం పలు జాగ్రత్తలు తీసుకున్నట్టు వివో కంపెనీ ప్రకటించింది.