Business Ideas: ఎకరం భూమి ఉంటే చాలు.. ఈ పంట పండిస్తే.. మీ ఇంట కనక వర్షం కురిసినట్లే

Business Ideas: ఎకరం భూమి ఉంటే చాలు..ఈ పండ పండిస్తే మీరు లక్షల్లో ఆదాయం పొందవచ్చు. అవును ఉన్న ఊరిలోనే కాలు కదపకుండా ఈ బిజినెస్ చేస్తే కోటీశ్వరులు అవుతారు. మార్కెట్లో ఎక్కువ ఆదాయం వచ్చే ఓ సరికొత్త పంట గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 
 

1 /8

Business Ideas: మీరు ఏదైనా కొత్తగా వ్యవసాయ ఆలోచన కోసం చూస్తున్నట్లయితే.. యాలకుల వ్యవసాయం వ్యాపారం మంచి ఆప్షన్ గా చెప్పవచ్చు.  యాలకులు లాభదాయకమైన పంట. కేరళలో అత్యధిక సంఖ్యలో రైతులు దీని సాగు చేస్తుంటారు. దేశంలోనే  కాదు విదేశాల్లో కూడా దీనికి చాలా డిమాండ్ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఈ ఖరీఫ్ సీజన్లో ఏలాకులు సాగు చేస్తే మంచి లాభాన్నిపొందవచ్చు.  

2 /8

భారతదేశంలో యాలకులు పెద్ద ఎత్తున పండిస్తారు. దీనిని వాణిజ్య పంటగా పండిస్తుంటారు. దేశంలోని రైతులు ఏలకుల సాగు ద్వారా బాగా సంపాదిస్తున్నారు. మీరు కూడా ఏలకులు పండించాలి అనుకుంటే కొన్ని చిట్కాలు మీకోసం అందిస్తున్నాము. అవేంటో చూడండి. 

3 /8

భారతదేశంలో ఏలకులు ప్రధానంగా కేరళ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో పండిస్తుంటారు. దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ఏలాకులకు మంచి డిమాండ్ ఉంది. ఆహారం, స్వీట్, పానీయల తయారీలో ఏలాకులను ఉపయోగిస్తుంటారు. ఇది స్వీట్ లకు రుచి, సువాసన జోడించేందుకు ఉపయోగపడుతుంది  

4 /8

ఏలకుల సాగుకు లోమీ నేల మంచిదని భావిస్తారు. నల్ల నేలలో కూడా సాగు చేస్తారు. ఎలాకుల సాగులో మంచినీటి వ్యవస్థ ఉండాలి. ఇసుక నేలలో ఏలాకుల సాగు చేయడం అంత లాభదాయకంగా ఉండదు. ఏలాకుల సాగుకు 10 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రత మంచిదాని చెబుతుంటారు.  

5 /8

 ఒక యాలకుల మొక్క ఒకటి నుంచి రెండు అడుగుల పొడవు ఉంటుంది. ఈ మొక్క కాండము ఒకటి నుండి రెండు మీటర్ల వరకు పొడవు పెరుగుతుంది. మొక్క ఆకులు 30 నుండి 60 సెంటీమీటర్లు ఉంటాయి. దీని వెడల్పు ఐదు నుండి తొమ్మిది సెంటీమీటర్లు ఉంటుంది. మీ పొలం సరిహద్దుల్లో ఏలకుల మొక్కలు నాటాలనుకుంటే ఒకటి నుండి రెండు అడుగుల దూరంలో మొక్కలు నాటాలి. రెండు నుంచి మూడు అడుగుల దూరంలో నాటితే తవ్విన గుంతలో మంచి మొత్తంలో  ఎరువు వేయాలి  

6 /8

ఇక ఈ మొక్కలు పరిపక్వానికి వచ్చేందుకు  మూడు నుంచి నాలుగు ఏళ్ల సమయం పడుతుంది. పంట పండించిన తర్వాత కొన్ని రోజులు సూర్యకాంతిలో ఎండబెట్టడం లేదంటే దాని కోసము ఏదైనా యంత్రం ఉపయోగించవచ్చు. ఇది 18 నుంచి 24 గంటల వేడిలో ఆరబెట్టాలి.   

7 /8

ఈ పంటను ఎక్కువగా వర్షాకాలంలో పండిస్తారు. వర్షాకాలంలో మొక్కలు నాటితే సాధారణంగా భారతదేశంలో దీని ముక్కలు జులై నెలలో నాటుతారు. ఈ సమయంలో నీటిపారుదల  అవసరం తక్కువగా ఉంటుంది. ఈ మొక్కలు నీడలో నాటాలి. అధిక సూర్యకాంతి వేడి ఈ పంటకు దిగుబడిని తగ్గిస్తుంది.  

8 /8

యాలకులు పూర్తిగా ఆరిపోయినప్పుడు మొక్కను చేతితో లేదా కొబ్బరి చాపతో రుద్దుతారు.  అప్పుడు అది ఆకారం, రంగు ప్రకారం వేరు అవుతుంది. మీరు వీటిని  మార్కెట్లో అమ్మడం ద్వారా భారీగా సంపాదించవచ్చు. ఎకరానికి 175 నుంచి 150 కిలోల దిగుబడి పొందవచ్చు. మార్కెట్లో కిలో 1100 నుండి 2000 వరకు ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఐదు నుంచి ఆరు లక్షల రూపాయల వరకు సంపాదించవచ్చు .