Business Ideas: మీరు స్వంత వ్యాపారం ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే తక్కువ పెట్టుబడితో వ్యాపారం చేయాలన్న మీ కలను సాకారం చేసుకోవచ్చు. పెట్టుబడి తక్కువ.. రాబడి ఎక్కువ అందించే వ్యాపారాల గురించి తెలుసుకుందాం.
Business Ideas: మేకల పెంపకం వ్యాపారాన్ని ప్లాన్ ప్రకారం చేసినట్లయితే ఏడాదికి రూ. 10లక్షల వరకు లాభాలు పొందవచ్చు. మోదీ ప్రభుత్వం అందించే సబ్సిడీతోపాటు నాబార్డ్ లోన్ స్కీమ్స్, సరైన నిర్వహణ పద్దతుల ద్వారా మహిళలు, యువత ఈ వ్యాపారం విజయం సాధించే అవకాశం ఉంటుంది.
Business Ideas: పంటలు పండించాలంటే ఎకరాల కొద్దీ భూములు ఉండాల్సిన అవసరం లేదు. కాస్త తెలివి ఉంటే చాలు 10 గుంటల భూమిలోనూ బంగారం పండించవచ్చు. అందుకే నేటి కాలంలో చాలా మంది రైతులు సాంప్రదాయ పంటలను పక్కన పెట్టి తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు వచ్చే పంటల వైపు మొగ్గు చూపిస్తున్నారు. బంజరు భూముల్లోనూ బంగారం పండిస్తూ ఎంతో మంది రైతులు ఆదర్శంగా నిలుస్తున్నారు. తక్కువ పెట్టుబడితో.. భారీగా లాభాలు అందిస్తున్న ఒక పంట గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పంటకు ప్రభుత్వం సబ్సిడీ కూడా అందిస్తోంది.
Housewife Business Ideas: ఆఫీసులకు వెళ్లక్కర్లేదు.. ఇంట్లో కూర్చుండి లక్షలు సంపాదించవచ్చు. ఈ డిజిటల్ యుగంలో, ఇంటి నుంచే డబ్బు సంపాదించడం పెద్దగా కష్టమేమీ కాదు. మహిళలు ఇంటి నుంచే ప్రారంభించి మంచి ఆదాయం సంపాదించగల ఉద్యోగాలు చాలా ఉన్నాయి. అందులో తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం పొందే 5 హోం బిజినెస్ ఐడియాస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Dairy Farming Business: డైరీ బిజినెస్ ప్రారంభించాలనుకునేవారికి ప్రారంభ ఖర్చులు, డబ్బు సంపాదించే మార్గాలు పశువుల జాతి ఎంపిక ఇవ్వన్నీ ముఖ్యం. ఇందులో ఏదొకటి లోపించిన వ్యాపారం ముందుకు సాగడం కష్టం అవుతుంది. ముఖ్యంగా జంతువుల ఆరోగ్యం, పాల శుద్ధి వంటి అంశాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టాలి. మీరు కూడా పారి పరిశ్రమలో రాణించాలనుకుంటే ఈ 5 టిప్స్ తెలుసుకోండి. వీటిని పాటిస్తే నెలకు లక్షల్లో సంపాదనతోపాటు మీ బిజినెస్ మూడు పువ్వులు, ఆరు కాయల మాదిరి దూసుకుపోతోంది.
Business Ideas 2026: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం యువత కోసం ఎన్నో స్కీములను ప్రవేశపెడుతోంది. అందులో భాగంగానే అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకం ముద్ర యోజన. ఈ పథకం కింద ఇప్పటికే 50కోట్ల మంది లబ్దిదారులు బ్యాంకుల నుంచి ఎలాంటి తాకట్టు లేకుండా లోన్స్ పొంది వ్యాపారాలు ప్రారంభించారు. మీరు కూడా ముద్ర యోజన నుంచి లోన్ తీసుకుని ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే.. ఈ బిజినెస్ ఐడియాను ఓసారి చెక్ చేయండి.
Business Ideas: మారుమూల గ్రామంలో ఉన్న మహిళలు కూడా నెలకు లక్ష రూపాయలు ఈజీగా సంపాదించుకోవచ్చు. అయితే ఎలాంటి వ్యాపారం చేస్తే మీ ఇంటి అవసరాలకు తగ్గ ఆదాయం లభిస్తుందని ఆలోచిస్తున్నారా. అయితే ఓ చక్కటి బిజినెస్ ఐడియా మీ ముందుకు తీసుకువచ్చాము. ఈ వ్యాపారం చేసినట్లయితే మీరు సులభంగా ప్రతినెల భారీగా ఆదాయాన్ని పొందవచ్చు. అయితే ఆ బిజినెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
New business ideas: మహిళలు స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని ఆలోచిస్తున్నట్లయితే, తక్కువ పెట్టుబడితో ఇంటి నుంచే ప్రారంభించగల మంచి వ్యాపార ఆలోచనలలో ఫ్యాషన్ డిజైనింగ్ ఒకటి. ఈ రంగంలో ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది.
Business Ideas: ఏ వ్యాపారం అయినా సరే మీరు అనుకున్న ప్లాన్ అమలు చేస్తే కొన్ని రోజులు ఓపిక పడితే చాలు లాభాలు గ్యారెంటీగా వస్తాయి. అంతేకానీ వ్యాపారం ప్రారంభించిన కొన్ని రోజుల్లో లాభాలు రాలేదని నిరాశ చెందకూడదు. అయితే అన్ని సీజన్లలో చేసుకునే ఓ వ్యాపారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే ఛాన్స్ ఉంటుంది.
Best Business Ideas: ప్రస్తుత కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. కలుషిత ఆహారం, వేగవంతమైన జీవనశైలి కారణంగా అనేక సమస్యలు ఎదురవుతుండటంతో ప్రజలు సహజమైన, రసాయన రహిత ఆహారానికి మొగ్గు చూపుతున్నారు. ఈ మారుతున్న అభిరుచిని సరైన విధంగా వినియోగించుకుంటే మంచి వ్యాపార అవకాశాన్ని సృష్టించుకోవచ్చు. అలాంటి అవకాశాల్లో ఆర్గానిక్ ఫుడ్ థాలీ ఒక మంచి ఎంపికగా నిలుస్తోంది.
Business Ideas: ఈ సంక్రాంతి పండుగను అవకాశంగా మార్చుకుని తక్కువ పెట్టుబడితో ఈ చిన్న వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. చేతితో చేసిన కార్డులు, ఆభరణాలు, గిఫ్ట్ హ్యాంపర్లకు పండుగ వేళ మంచి డిమాండ్ ఉంటుంది. సరైన ప్రణాళికతో ప్రారంభిస్తే త్వరగా లాభాలు సంపాదించే అవకాశం ఉంది.
Business Ideas: సొంతంగా వ్యాపారం మొదలుపెట్టాలనేది చాలామందికి ఉన్న కల. అయితే పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టిన తర్వాత నష్టం వస్తుందేమో అనే భయం చాలా మందిని వెనక్కి నెట్టేస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగంతో పాటు అదనపు ఆదాయం కోరుకునేవారికి ఈ భయం మరింత ఎక్కువగా ఉంటుంది. కానీ తక్కువ పెట్టుబడితో, రిస్క్ దాదాపు లేని వ్యాపారాలు ఉంటే పరిస్థితి వేరేలా ఉంటుంది. కేవలం రూ.10,000 లోపే ప్రారంభించగల కొన్ని చిన్న వ్యాపారాలు నెలవారీగా మంచి ఆదాయం తెచ్చిపెట్టే అవకాశం కల్పిస్తాయి. ఇప్పుడు అలాంటి కొన్ని సులభమైన బిజినెస్ ఐడియాలను చూద్దాం.
Business Ideas: మహిళలు ఇంటి వద్ద నుంచే పిండి వంటల వ్యాపారం ప్రారంభించి నెలకు మంచి ఆదాయం సంపాదించవచ్చు. రూ.10 వేల లోపు పెట్టుబడితో మురుకులు, స్వీట్స్ వంటి హోం మేడ్ స్నాక్స్ తయారు చేసి, వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా ఆర్డర్లు తీసుకుని లాభాలు పొందవచ్చు.
Business Ideas: బంగారం ధరలు లక్షల్లోకి చేరడంతో ఆభరణాల వినియోగం కష్టమైంది. ఈ పరిస్థితిలో వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ చౌక, సురక్షిత ప్రత్యామ్నాయంగా మారింది. తక్కువ పెట్టుబడితో 50–60 శాతం లాభాలతో ఈ బిజినెస్ ప్రారంభించి మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది.
Business ideas: ఉద్యోగం అంటే విరక్తి కలిగిందా? ఇక నుంచి ఎవరి కిందా పని చేయకూడదని డిసైడ్ అయ్యారా? ఇలా చాలా మందే అనుకుంటారు. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల తప్పని పరిస్థితుల్లో ఉద్యోగాలు చేయాల్సి వస్తుంటుంది. జీతం తక్కువ ఉన్నా.. టార్గెట్లు ఎక్కువ ఉన్నా ఆర్థిక పరిస్థితులు ఉద్యోగం చేసేందుకు తోస్తుంటాయి. అయితే మీరు ఉద్యోగం వదిలి ఏదైనా మంచి వ్యాపారం ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే మీకో చక్కటి అవకాశం అందిస్తోంది అమూల్. భారత్ లో విశ్వసనీయమైన బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న అమూల్.. తక్కువ పెట్టుబడితో స్వంతగా వ్యాపారం ప్రారంభించేందుకు ఛాన్స్ ఇస్తోంది. ఈ అమూల్ ఫ్రాంజైజీ ద్వారా మీరే బాస్ మారే అవకాశం ఉంటుంది.
Business Ideas: చాలా వరకు ఇళ్లలో ఉదయం 9 నుంచి 10 గంటలలోపు ఇంటి పనులు, వంట పనులు ముగుస్తుంటాయి. ఎందుకంటే పిల్లలు ఉదయం 8గంటల వరకే స్కూల్స్ వెళ్తుంటారు. ఆ సమయం వరకు వారికి టిఫిన్, లంచ్ పూర్తి చేసి బాక్సులు పెట్టాలి. 9 గంటలకు భర్త ఉద్యోగం చేసేవారైతే.. వాళ్లకు లంచ్ బాక్స్ పెట్టి పంపిస్తుంటారు. వారంతా వెళ్లిన తర్వాత మిగతా పనులు చేసుకుని 12గంటల వరకు ఫ్రీ అవుతుంటారు. మళ్లీ పిల్లలు స్కూల్ నుంచి 4 నుంచి 5 గంటల మధ్య వస్తుంటారు. ఆ సమయంలో ఖాళీ ఉంటూ బోర్ కొడుతుంది అనుకునే మహిళలు ఎంతో మంది ఉంటారు. అలాంటి వారి కోసం ఇప్పుడు మేము చెప్పే బిజినెస్ లు మంచి ఆదాయాన్ని సంపాదించి పెడతాయి. ఈ బిజినెస్ లు ఇంట్లో కూర్చుండి కూడా చేసుకోవచ్చు. అవేంటో చూద్దాం.
Business Ideas: చాలా మంది వ్యాపారంలో రాణించాలని కోరుకుంటారు. కొంతమంది ఉద్యోగాలను వదిలేసి వ్యాపారాల్లో స్థిరపడాలని భావిస్తుంటారు. 8గంటలపాటు చేసే ఉద్యోగం కంటే రోజుకు రెండు మూడు గంటలు కష్టపడి వ్యాపారం చేస్తే భారీ మొత్తంలో సంపాదిస్తున్నవారు ఎంతో మంది ఉన్నారు. ఉద్యోగం చేస్తూ కూడా కొంత సమయం ఈ బిజినెస్ లకు కేటాయిస్తే మంచి రాబడి పొందవచ్చు. సరైన వ్యూహంతో ప్రారంభిస్తే.. ఈ రంగాలలోని ఐదు స్టార్టప్‌లు మీకు మంచి ఆదాయం మాత్రమే కాకుండా, భవిష్యత్తులో కోట్ల రూపాయల సంపాదనకు మార్గం చూపగలవు. ఆ బిజినెస్ లు ఏవో చూద్దాం.
Business Ideas: దేశవ్యాప్తంగా స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన పథకాలలో ప్రధాన మంత్రి ముద్రా యోజన కూడా ఒకటి. ఈ స్కీమ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 50 కోట్లకు పైగా మందికి రుణాలు మంజూరు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ముద్రా లోన్ల ప్రత్యేకత ఏమిటంటే, రూ. 50,000 నుంచి రూ. 10 లక్షల వరకు రుణాలు పొందవచ్చు. అదీ ఎలాంటి పూచీకత్తు అవసరం లేకుండానే.
Business Ideas: శీతాకాలంలో క్యారెట్ సాగు రైతులకు అత్యంత లాభదాయకమైన వ్యవసాయ అవకాశంగా మారుతోంది. ఈ సీజన్లో క్యారెట్లకు అధిక వినియోగం ఉండడం వల్ల మార్కెట్ డిమాండ్ గణనీయంగా పెరుగుతుంది. సరైన సాగు పద్ధతులు, అనుకూల నేల, భరోసా గల రకాలను ఎంచుకుంటే రైతులు తక్కువ కాలంలోనే అధిక దిగుబడితో పాటు మంచి ఆదాయం పొందగలరు. ఈ పంట ప్రస్తుతం అనేక మంది రైతులకు ఒక స్థిరమైన వ్యాపార మోడల్‌గా మారింది.
Business Ideas: మహిళలు మీరు కూడా బిజినెస్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే ఖాళీ సమయంలో ఈ బిజినెస్ చేస్తే ప్రతినెలా లక్షల ఆదాయం సంపాదించే అవకాశం ఉంది. ఇప్పుడు వచ్చేది పెళ్లిళ్ల సీజన్ ఈ సీజన్ లోనే ఈ వ్యాపారం ప్రారంభిస్తే మంచి లాభాలను పొందవచ్చు. ఆ బిజినెస్ ఏంటో చూద్దాం.
Business Ideas: భారత్ లో పెరుగుతున్న టెక్స్టైల్ మార్కెట్ కారణంగా.. బంగ్లాదేశ్ నుండి వస్త్రాలను దిగుమతి చేసుకోవడం తక్కువ పెట్టుబడితో లాభదాయకమైన వ్యాపారం. IEC కోడ్‌తో ప్రారంభించి, నమ్మకమైన సరఫరాదారుల ద్వారా నాణ్యమైన ఫాబ్రిక్స్ తెచ్చుకోవచ్చు. రూ. 1.5–రూ. 2 లక్షలతో చిన్నగా మొదలుపెట్టి, 25–40శాం లాభం పొందవచ్చు.
Business Ideas: ఈ రోజుల్లో జీవన వ్యయం పెరిగిపోవడంతో ప్రతి ఒక్కరూ అదనపు ఆదాయ మార్గాల కోసం ఆలోచిస్తున్నారు. చాలా మంది ఉద్యోగం చేస్తున్నా నెల జీతంతో అన్ని ఖర్చులు తీరడం కష్టంగా మారింది. కొంతమంది మహిళలు చదువుకున్నప్పటికీ కుటుంబ పరిస్థితుల వల్ల ఇంటి బయటకు వెళ్లి ఉద్యోగం చేయడం సాధ్యంకాక ఇంటికే పరిమితం అవుతున్నారు. అలాంటి వారికోసం తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సెట్విన్ (SETWIN) సంస్థ చక్కటి అవకాశం అందిస్తోంది.