Stree To Go Goa Gone: కడుపుబ్బా నవ్వించే ఈ హారర్ కామెడీ సినిమాలు చూశారా ?
Stree To Go Goa Gone: కడుపుబ్బా నవ్వించే ఈ హారర్ కామెడీ సినిమాలు చూశారా ?
Aapke Kamre Mein Koi Rehta hai - ఆప్కే కమ్రె మే కోయూ రెహతా హై మూవీ హారర్ కామెడి నేపథ్యంతో తెరకెక్కింది. నలుగురు స్నేహితులకు చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఏ దిక్కూ లేని పరిస్థితిలో ఓ ఇంట్లోకి మకాం మార్చాల్సి ఉంటుంది. అదే ఇంటికి ఏవో కనిపించని శక్తి ఉందని అక్కడి వాళ్లు నమ్ముతారు. అందుకు తగినట్టుగానే మొదటి రోజు రాత్రే వారిలో ఒకరు చనిపోతారు. కానీ చనిపోయిన ఆ వ్యక్తి మళ్లీ కనిపిస్తాడు. ఆ సస్పెన్స్ ఏంటో తెలియాలంటే ఆప్కే కమ్రె మే కోయూ రెహతా హై మూవీ వీక్షించాల్సిందే.
Bhoothnath - భూత్నాథ్ మూవీ 2008 లో విడుదలైంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, జూహీ చావ్లా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ ఓ అతిథి పాత్రలో కనిపించాడు. అమితాబ్ బచ్చన్ దెయ్యం పాత్రలో నటించిన ఈ హారర్ కామెడి సినిమాను పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ లైక్ చేశారు.
Chaipatti - ఛాయ్పత్తి మూవీ కథనం ఏంటంటే... ముగ్గురు స్నేహితులు కలిసి ఒక పుస్తకంలో ఉన్న మంత్రాల సహాయంతో దెయ్యాన్ని పిలిచేందుకని సిద్ధం అవుతారు. క్యాండిల్స్ వెలిగించి, మంత్రాలు చదువడం మొదలుపెడతారు. అంతలోనే ఎవరో డోర్ కొడుతున్న శబ్ధం... ఆ తరువాత ఏం జరిగింది అనేదే ఛాయ్పత్తి మూవీ కథనం. ఈ హారర్ కామెడి మూవీ ప్రస్తుతం డిస్నీ + హాట్‌స్టార్ ఓటిటిలో అందుబాటులో ఉంది.
Go Goa Gone - గో గోవా గాన్ మూవీ 2013 లో విడుదలైంది. అప్పటి వరకు హాలీవుడ్ చిత్రాల్లో మాత్రమే చూసిన జాంబీలను తొలిసారిగా ఇండియన్ సెల్యూలాయిడ్‌పై చూపించిన సినిమా ఇది. ఈ జాంబీ యాక్షన్ కామెడి సినిమా ప్రస్తుతం అమేజాన్ ప్రైమ్ ఓటిటిలో అందుబాటులో ఉంది.
Pati Patni Aur Woh Movie : పతీ పత్నీ ఔర్ ఓ మూవీ.. ఒక వ్యక్తి భార్య చనిపోతుంది. ఆమె చివరి కోరిక ఏంటంటే.. తన ఆత్మ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయేలోగా తన భర్త రెండో పెళ్లి చేసుకోవాలనేది ఆమె బలమైన కోరిక. అలా ఆమె కర్మకాండల చివరి రోజే అతడు రెండో పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మొత్తం క్రమంలో ఏం జరిగిందనేదే పతీ పత్నీ ఔర్ ఓ మూవీ కాన్సెప్ట్. కడుపుబ్బా నవ్వించే కామెడీ కథనంతో సాగిపోయే ఈ చిత్రాన్ని మీరు చూశారా ?
Stree To Go Goa Gone: స్త్రీ హారర్ కామెడి మూవీ రిలీజై ఐదేళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ కడుపుబ్బా నవ్వించే చిత్రాల్లో ఇది ఎప్పుడూ ముందే ఉంటుంది. అమర్ కౌశిక్ అనే కొత్త దర్శకుడిని బాలీవుడ్ పరిశ్రమకి పరిచయం చేసిన సినిమా ఇది. శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను చూస్తే.. తెలుగులో ఓ స్త్రీ రేపురా అని ఓ దశాబ్ధంన్నర కిందట వైరల్ అయిన కాన్సెప్ట్ గుర్తుకొస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటిటిలో అందుబాటులో ఉంది.
Horror Comedy movies in hindi : వీకెండ్ వచ్చేసింది. నాన్-స్టాప్ ఎంటర్ టైన్మెంట్ కోసం వివిధ ఓటిటి ప్లాట్‌ఫామ్స్‌లో మాంచి టైమ్ పాస్ అయ్యే హారర్ కామెడీ సినిమాలు మీ కోసం రెడీగా ఉన్నాయి. హారర్ కామెడీ సినిమాల్లో కొన్ని టాప్ మోస్ట్ హారర్ కామెడి సినిమాల జాబితాను రెడీ చేసి ఇక్కడ అందిస్తున్నాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.