Unhealthy Gut Signs: మీ కడుపులో పురుగులున్నాయా లేవా, ఈ లక్షణాలతో తెలిసిపోతుంది

Unhealthy Gut Signs: మనిషి ఆరోగ్యానికి జీర్ణక్రియ అత్యంత కీలకం. ప్రేవులు ఆరోగ్యంగా ఉంటే జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. ఎందుకంటే ప్రేవుల్లో కోట్లాది బ్యాక్టీరియాలు పెరుగుతుంటాయి. ఇవి శరీరంలో ఇన్‌ఫెక్షన్‌కు కారణమౌతుంటాయి. శరీరంలో ఈ పరిస్థితిని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం..

Unhealthy Gut Signs: మీ కడుపులో అంటే ప్రేవుల్లో పరుగులు ఉన్నాయో లేదో ఎలా తెలుసుకోవడం. చాలామందిలో ఈ ప్రశ్న రావడం సహజం. ఎందుకంటే దీర్ఘకాలం ప్రేవులు ఆరోగ్యంగా లేకపోతే వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతాయి. కొన్ని లక్షణాల ద్వారా ప్రేవుల్లో పురుగులు ఉన్నాయో లేవో తెలుస్తుంది.

1 /5

కడుపు ఉబ్బరం చాలారోజులుగా కడుపు ఉబ్బరంగా ఉంటే తేలిగ్గా తీసుకోవద్దు. తక్షణం పరీక్ష చేయించుకోవాలి. కడుపులో అంటే ప్రేవుల్లో పరుగులున్నాయో లేదే తెలుసుకుని మందులు తీసుకోవడం మంచిది. 

2 /5

కడుపులో నొప్పి మలద్వారం ద్వారా గ్యాస్ విడుదలైనప్పుడు అక్కడ విపరీతమైన నొప్పి ఉంటుంది. కడుపులో లేదా ప్రేవుల్లో పురుగులు ఉంటే ఈ సమస్య ఉత్పన్నమౌతుంది. 

3 /5

గ్యాస్ ఎక్కువగా ఉండటం కడుపులో అజీర్తి కారణంగా గ్యాస్ పరిమితి దాటి విడుదలవుతుంటే ప్రేవుల్లో ఏదో సమస్య ఉన్నట్టు అర్ధం చేసుకోవచ్చు. ప్రేవుల్లో బ్యాక్టీరియా ఉంటేనే ఇలా జరుగుతుంది. ఇదొక ప్రమాదకర స్థితి. తక్షణం వైద్యుడిని సంప్రదించాలి.

4 /5

మలబద్ధకం ప్రేవుల్లో ఏ విధమైన సమస్య తలెత్తినా మలబద్ధకం, డయేరియా వంటి సమస్యలు రావచ్చు. అనారోగ్యకరమైన లేదా నిల్వ ఆహారం తింటే ఇలా జరుగుతుంది. అందుకే తీసుకునే ఆహారం హెల్తీగా ఉండాలి.

5 /5

యాసిడ్ రిఫ్లక్స్ చాలాసార్లు భోజనం చేసిన గంట తరువాత కూడా గొంతులో యాసిడ్ ఉన్నట్టు మండుతుంటుంది. ఎందుకంటే తినే ఆహారం జీర్ణమయ్యేందుకు కడుపులో విడుదలయ్యే గ్యాస్..గొంతు వరకూ వచ్చేస్తుంటుంది. ప్రేవుల్లో పురుగులకు ఇది సంకేతం కావచ్చు.