India vs Australia Highlights: టీమిండియా కల చెదిరింది. గత పదేళ్లుగా ఐసీసీ టోర్నీ గెలవాలనే నిరీక్షణ కొనసాగుతోంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆసీస్ చేతిలో ఓటమి పాలవ్వడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. చివరగా 2013లో ఛాంపియన్ ట్రోఫీని గెలిచిన తరువాత మళ్లీ ఇంతవరకు మరో టైటిల్ గెలవలేదు. ఫైనల్స్, సెమీ ఫైనల్స్‌కు చేరినా.. కప్ అందుకోవడంలో విఫలమైంది. దీంతో టీమిండియాను ఫైనల్ ఫీవర్ వెంటాడుతోంది.
వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరిన భారత్‌కు ఆస్ట్రేలియా షాకిచ్చింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌గా నిలిచి అన్ని ఐసీసీ ట్రోఫీలు గెలిచిన తొలి జట్టుగా నిలిచింది.
2022 టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో భారత్‌ను ఇంగ్లాండ్ ఓడించింది.
2021లో జరిగిన మొదటి టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓడిపోయింది.
2019 వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ వరుస సెంచరీలతో అలరించాడు. దీంతో సునాయసంగా టీమిండియా సెమీ ఫైనల్‌కు చేరుకుంది. అయితే సెమీస్‌లో న్యూజిలాండ్‌తో చేతిలో పరాభవం ఎదురైంది.
2017లో ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ భారత్‌ను ఓడించింది.
2016 టీ20 ప్రపంచ కప్ సెమీస్‌లో వెస్టిండీస్ చేతిలో టీమిండియాకు ఓటమి ఎదురైంది.
2015 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్.. సెమీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది.
2014 టీ20 ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్ చేరింది. కానీ శ్రీలంక చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది.