UPI Payment: యూపీఐ చెల్లింపుల్లో తస్మాత్ జాగ్రత్త, ఇలా మోసపోయే అవకాశాలు

UPI Payment: ఆన్‌లైన్ చెల్లింపులంటే వెంటనే గుర్తొచ్చేది యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్. పెద్దసంఖ్యలో వినియోగం ఎక్కువైంది. యూపీఐ చెల్లింపులు ఎక్కువయ్యే కొద్దీ మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. గత కొన్నేళ్లలో యూపీఐ మోసాలు చాలావరకూ వెలుగు చూశాయి. 

UPI Payment: యూపీఐ వినియోగం ఇటీవలి కాలంలో చాలా పెరిగింది. అదే సమయంలో యూపీఐ లావాదేవీల్లో మోసాలు కూడా అధికమయ్యాయి. యూపీఐ చెల్లింపులు చేసే సమయంలో మీకు తెలియకుండానే మోసపోతుంటారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా డబ్బులు ఖాళీ అయిపోతుంటాయి.

1 /5

యూపీఐ చెల్లింపులు ఎక్కువయ్యే కొద్దీ మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. గత కొన్నేళ్లలో యూపీఐ మోసాలు చాలావరకూ వెలుగు చూశాయి. 

2 /5

యూపీఐ పిన్ నెంబర్‌ను ప్రతి నెలా మారుస్తూ ఉండాలి లేదా పిన్ నెంబర్‌ను మూడు నెలలకోసారి మారుస్తుండాలి. యూపీఐ ద్వారా రోజువారీ లావాదేవీలకు ఓ పరిమితి పెట్టుకోవాలి.

3 /5

రివార్డులు, క్యాష్ బ్యాక్ లేదా ధనం ఆశ చూపించే వెబ్‌సైట్ల ద్వారా లావాదేవీలు జరపవద్దు. ఇలాంటి ఆశలు చూపించి మీ పిన్ తీసుకునే ఆస్కారముంది.

4 /5

కస్టమర్ కేర్ ప్రతినిధులకు ఎప్పుడూ మీ మొబైల్ లేదా కంప్యూటర్ యాక్సెస్ ఇవ్వవద్దు. బ్యాంక్ యాప్స్‌లో కొన్ని సెట్టింగులు చేసే వంకతో లేదా కేవైసీ వంకతో మిమ్మల్ని మోసం చేసేందుకు ప్రయత్నిస్తారు. 

5 /5

యూపీఐ పిన్‌ను ఎప్పుడూ ఎవరితోనూ పంచుకోవద్దు. ముఖ్యంగా కస్టమర్ కేర్ లేదా మెస్సేజ్‌లు వచ్చినప్పుుడ స్పందించవద్దు. యూపీఐ పిన్ ఎవరైనా అడిగారంటే కచ్చితంగా అది నకిలీ లేదా మోసపూరిత వ్యవహారం కావచ్చు. తస్మాత్ జాగ్రత్త.