Thanjavur Ancient Temple: ఆ ప్రాచీన ఆలయం నిర్మాణం వేయేళ్ల నుంచి రహస్యమే

Thanjavur Ancient Temple: యావత్ ప్రపంచంలో భారతదేశం సంస్కృతికి అత్యంత మహత్యం, ప్రాధాన్యత ఉన్నాయి. ఇది చాలా ప్రాచీనమైంది. భారత దేశ ప్రాచీన చరిత్రకు సాక్ష్యంగా ఎన్నో దేవాలయాలు, కోటలు, ఇతర స్మారకాలు ఇప్పటికీ ఠీవిగా నిలిచే ఉన్నాయి. 

Thanjavur Ancient Temple: భారతదేశ ప్రాచీన చరిత్రకు సాక్ష్యంగా నిలిచే చాలా కట్టడాల వెనుక ఉన్న రహస్యాన్ని ఇప్పటికీ శాస్త్రవేత్తలు ఛేధించలేకపోయారు. అలాంటి రహస్యమయమైన దేవాలయమే ఇది. దాదాపు వేయి ఏళ్ల ప్రాచీన శివాలయమిది. ఈ శివాలయం విశిష్టత ఏంటో తెలుసుకుందాం..
 

1 /5

ఈ ఆలయం గోపురం బరువు దాదాపుగా 88 టన్నులు. ఒకే రాయితో నిర్మించారు. గోపురం పైభాగంలో 12 అడుగుల స్వర్ణ కలశం ఉంచారు. ఇంత బరువైన గోపురం రాయిని అంతెత్తున ఎలా అమర్చారనేది మరో ప్రశ్న. ఇప్పటి వరకూ ఈ ప్రశ్నకు సమాదానం లేదు.

2 /5

ఈ ఆలయంలో అమర్చిన రాళ్లను ఒకదానికొకటి జోడించేందుకు సున్నం లేదా సిమెంట్ వాడలేదు.  రాళ్లకు కోణాల కింద కట్ చేసి వాటిలో అమర్చారు. ఈ ఆలయం గోపురం నీడ ఎక్కడా పడదని అంటారు.

3 /5

ఈ ఆలయం ఎత్తు దాదాపు 667 మీటర్లు ఉంటుంది. అంటే 15 అంతస్తుల భవనానికి సమానం.  ప్రతి అంతస్థు దీర్ఘచతురస్రాకారంలో ఉంది. ఆలయ నిర్మాణానికి గ్రానైట్ రాళ్లను ఉపయోగించారు. మొత్తం బరువు 1.3 లక్షల టన్నులు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ ఆలయానికి 100 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా గ్రానైట్ క్వారీనే లేదు. అలాంటిది అంత బరువైన గ్రానైట్ రాళ్లను ఇక్కడికి ఎలా తీసుకురాగలిగారనేది ప్రశ్నార్ధకం.

4 /5

ఈ ఆలయాన్ని నిర్మించి 1 వేయి ఏళ్లకు పైనే దాటింది. అయినా ఇప్పటి వరకూ చెక్కుచెదరలేదు. విశేషమేమంటే ఈ ఆలయానికి అసలు పునాదే లేదు. పునాది లేకుండా వేయేళ్లకు పైనే నిలబడి ఉంది. ఈ ఆలయం పిరమిడ్ ఆకారంలో ఉంటుంది.

5 /5

తమిళనాడులోని తంజావూరులో ఉన్న బృహదేశ్వరాలయం ఇది. స్థానికంగా ఈ గుడిని పెరూవుటయర్ కోవెలగా పిలుస్తారు. ఈ ఆలయం శివునిది. ఈ ఆలయాన్ని చోళ రాజైన రాజరాజ చోళుడు 1 నిర్మించాడు. ఈ ఆలయ నిర్మాణం 1003-1010 సంవత్సరాల మధ్య జరిగింది.