SUV Discount Offers: ఆ ఎస్‌యూవీలపై లక్ష రూపాయల వరకూ డిస్కౌంట్ ఆఫర్

SUV Discount Offers: ఇటీవలి కాలంలో ఎస్‌యూవీ లేదా 7 సీటర్ కార్లకు క్రేజ్ పెరుగుతోంది. అందుకే మారుతి సుజుకి, హ్యుండయ్, టాటా మోటార్స్, కియా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్ర ఇలా అన్ని కంపెనీలు వివిధ రకాల ఫీచర్లతో ఎస్‌యూవీలు లాంచ్ చేస్తున్నాయి.

SUV Discount Offers: ఒకవేళ మీరు కూడా ఎస్‌యూవీ కొనుగోలుకు ఆలోచిస్తుంటే ఇంతకంటే మంచి అవకాశం మళ్లీ రాకపోవచ్చు. హ్యుండయ్ నుంచి మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ వరకూ అన్ని కంపెనీలు ఎంపిక చేసిన కార్లపై భారీ డిస్కౌంట్ అందిస్తున్నాయి. ఏకంగా ప్రతి ఎస్‌యూవీపై 1 లక్షరూపాయల వరకూ మినహాయింపు లభించనుంది. అలాంటి 5 ఎస్‌యూవీల గురించి తెలుసుకుందాం..

1 /5

రీనాల్ట్ కైగర్ రీనో కైగర్ సౌకర్యవంతమైన ఎస్‌యూవీగా చెప్పవచ్చు. ఈ కారుపై 77 వేల రూపాయల వరకూ డిస్కౌంట్ లభించవచ్చు. ఇందులో 25 వేల రూపాయలు క్యాష్ డిస్కౌంట్ కాగా, 20 వేల రూపాయలు ఎక్స్చేంజ్ బోనస్, మరో 20 వేల రూపాయలు లాయల్టీ బోనస్ అందుతుంది. ఇది కాకుండా 12 వేల రూపాయలు కార్పొరేట్ డిస్కౌంట్ అందుతుంది.

2 /5

మహీంద్రా ఎక్స్‌యూవీ 300 మహీంద్రా ఎక్స్‌యూవీ 300 పై ఇప్పుడు 55 వేల రూపాయలు డిస్కౌంట్ ఉంది. ఈ ఎస్‌యూవీ బేసిక్ మోడల్ ధర 8.41 లక్షలుగా ఉంది. ఇందులోనే టాప్ మోడల్ అయితే 14.60 లక్షలు

3 /5

మహీంద్రా బొలేరో నియో మహీంద్రా బొలేరో నియోపై ఇప్పుడు 50 వేల వరకూ డిస్కౌంట్ ఉంది. ఈ కారు ధర 9.63 లక్షల నుంచి ప్రారంభమౌతుంది.

4 /5

మహీంద్రా బొలేరో మహీంద్రా కంపెనీకు చెందిన అత్యధికంగా విక్రయమయ్యే ఎస్‌యూవీ. దీనిపై ఇప్పుడు 70 వేల వరకూ డిస్కౌంట్ ఉంది. మహీంద్రా బొలేరో ధర 9.78 లక్షల నుంచి ప్రారంభం కానుంది.

5 /5

హ్యుండయ్ కోనా జూలై నెలలో హ్యుండయ్ కోనా ఎలక్ట్రిక్ కారుపై 1 లక్ష రూపాయల వరకూ ఆఫర్ ఉన్నది. ఇది హ్యుండయ్ కంపెనీ ఎలక్ట్రిక్ కారు. దీని ధర 23.84 లక్షల నుంచి ప్రారంభం కానుంది.