EPFO 95: ఈపీఎస్ 95 పెన్షన్ దారులకు దీపావళి నాటికి గుడ్ న్యూస్...మినిమం పెన్షన్ రూ. 7500 లభించే చాన్స్

EPS 95 pensioners: మోదీ ప్రభుత్వం సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న 70 లక్షల మంది పెన్షనర్లకు త్వరలోనే గుడ్ న్యూస్ వినిపించే అవకాశం ఉంది. ఈపీఎస్ 95 పెన్షన్ దారులకు కేంద్ర ప్రభుత్వం హయ్యర్ పెన్షన్ అమలు చేసే అవకాశం ఉందని ఢిల్లీలో వార్తలు షికారు చేస్తున్నాయి.

1 /6

EPFO Pension: కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం.. అతి త్వరలోనే ఈపీఎస్ 95 పెన్షన్ దారులకు గుడ్ న్యూస్ వినిపిస్తుందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.  ఇప్పటికే ఎయిట్ పే కమిషన్ పైన కేంద్ర ప్రభుత్వం త్వరలోనే సానుకూలంగా స్పందిస్తుందని వార్తల నేపథ్యంలో.. ఇప్పుడు ఈపీఎస్ 95 పెన్షన్ దారులకు సైతం త్వరలోనే హయ్యర్ పెన్షన్ అమలు చేసేందుకు త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పలువురు ఉద్యోగులు పెన్షన్ దారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

2 /6

ఇదిలా ఉంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా దాదాపు 70 లక్షల మంది ఈపీఎస్ 95 పెన్షన్ దారులు తమకు పెన్షన్ వస్తుందని సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే వీరిలో అత్యధిక శాతం మందికి కేవలం 1000 రూపాయల పెన్షన్ మాత్రమే లభిస్తుంది. వీరికి కనీస పెన్షన్ 7500 చేయాలని సుదీర్ఘకాలంగా డిమాండ్ వినిపిస్తోంది. అంతేకాదు సర్వోన్నత న్యాయస్థానం సైతం దీనిపైన సానుకూలంగా స్పందించి ఈపీఎఫ్ సంస్థను ఆదేశించింది.

3 /6

ఇదిలా ఉంటే ఇప్పటికే దశాబ్ద కాలంగా ఉద్యోగులు పెన్షన్దారులు ఈపీఎస్ 95 పెన్షన్ పెంపుదల చేయాలని పలు డిమాండ్లు వినిపిస్తున్నారు.  ముఖ్యంగా ఈపీఎస్ 95 పెన్షన్ ఆందోళన సమితి దీనిపైన పలువురు కేంద్ర మంత్రులను సైతం కలిసి తమ గోడును విన్నవించుకుంది. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం దీనిపైన సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వచ్చాయి.   

4 /6

 ఇక కేంద్రమంత్రి మన్ సుఖ్ మాండవియా సైతం ఈపీఎస్ 95 కార్యాచరణ సమితి పెన్షన్దారులకు హామీని అందించారు.  కాగా త్వరలోనే ఈపీఎస్ 95 పెన్షన్ కనీస మొత్తం 7500 కు పెంచే అవకాశం ఉందని.. దీనిపైన కేంద్ర ప్రభుత్వం త్వరలోనే సానుకూల నిర్ణయం సైతం తీసుకునే అవకాశం ఉందని ఢిల్లీలో పలు వర్గాలు చెబుతున్నాయి.   

5 /6

ఈపీఎస్ 95 పెన్షన్ స్కీం కింద దేశవ్యాప్తంగా దాదాపు 70 లక్షల మందికి ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు పెన్షన్ లభిస్తుంది.  అయితే ఈ మొత్తం చాలా తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో కనీస వేతనం ఆధారంగా పెన్షన్ విధానం అమలు చేయాలని పెన్షన్ దారులు డిమాండ్ చేస్తున్నారు.  

6 /6

అయితే దీపావళి నాటికి కేంద్ర ప్రభుత్వం పెన్షన్ దారులకు గుడ్ న్యూస్ వినిపించే అవకాశం ఉందనే వార్తలు కూడా కొట్టి పారేయడం లేదు. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.  ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పలువురు చెప్తున్నారు.  దీనిపైన మోడీ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో ఎదురు చూడాల్సిందే.