Diabetes Tips: మధుమేహం వ్యాధికి చికిత్స లేదు. అందుకే అది అత్యంత ప్రమాదకర వ్యాధుల జాబితాలో నిలిచింది. పూర్తిగా చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా, శారీరక శ్రమ లోపించడంతో ఏర్పడే వ్యాధి ఇది.
Diabetes Tips: అయితే కేవలం ఒకే ఒక ఫ్రూట్‌తో డయాబెటిస్ సమస్యకు చెక్ పెట్టవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచవచ్చు. ఆ వివరాలు తెలుసుకుందాం..
స్నాక్స్ విత్ లెమన్ రోజూ మనం వివిధ సందర్భాల్లో తినే స్నాక్స్‌తో కూడా నిమ్మరసం జోడించి తినడం అలవాటు చేసుకోవాలి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.
సలాడ్ విత్ లెమన్ సలాడ్ అనేది కచ్చితంగా హెల్తీ ఫుడ్. ఇందులో నిమ్మరసం జోడిస్తే మరింత అద్బుతంగా మారనుంది. నిమ్మలో ఉండే విటమిన్లు, పొటాషియం మధుమేహం, బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రిస్తాయి.
లెమన్ బిఫోర్ ఫుడ్ భోజనం చేయడానికి కొద్దిసేపు ముందు లెమన్ వాటర్ తాగితే మంచి ఫలితాలుంటాయంటున్నారు. ఓ గ్లాసు లెమన్ వాటర్ చాలంటున్నారు.
లెమన్ టీ రోజూ పరగడుపున లెమన్ వాటర్ లేదా లెమన్ విత్ గ్రీన్ టీ తాగే అలవాటు ఉంటే శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించవచ్చు. ఇది చాలా మంచి అలవాటని వైద్యులు చెబుతుంటారు.
లెమన్ విత్ ఫుడ్ ఇక భోజనంతో పాటు నిమ్మరసం తీసుకుంటే అంటే తినే కూరల్లో లేదా భోజనంలో నిమ్మరసం కలుపుకుని తినడం వల్ల మంచి ఫలితాలుంటాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.