White Hair Turns Black Permanently: తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ మొక్క ఆకుల నుంచి తీసిన పౌడర్‌ని జుట్టుకు వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా దీనిని వినియోగించడం వల్ల సులభంగా జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.
White Hair Turns Black Permanently: ప్రస్తుతం చాలా మంది చిన్న తనంలోనే తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. కొంత మందిలో తెల్ల జుట్టు కారణంగా ముఖం అందహీనంగా తయారవుతోంది. ఇలాంటి సమస్యల రావడానికి ప్రధాన కారణం శరీరంలోని పోషక లోపమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారిలో జుట్టు రాలడం వంటి సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు మార్కెట్‌లో లభించే ఖరీదైన హానికరమైన రసాయనాలతో కూడిన ప్రోడక్ట్స్ వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించడం వల్ల చాలా రకాల జుట్టు సమస్యలకు దారీ తీయోచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అంతేకాకుండా కొంతమంది మార్కెట్‌లో లభించిన నాచురల్ హెయిర్ డై ప్రోడక్ట్స్ వినియోగించినప్పటికీ తెల్ల జుట్టును శాశ్వతంగా నల్లగా మార్చుకోలేకపోతున్నారు. అయితే ఆయుర్వేద నిపుణులు తెలిపిన కొన్ని చిట్కాలు వినియోగించడం వల్ల తెల్ల జుట్టు ఎప్పటికీ నల్లగా మారుతుందట.
తెల్ల జుట్టు నుంచి శాశ్వతంగా ఉపశమనం పొందడానికి ఆయుర్వేద నిపుణులు సూచించిన నీలి ఆకుల (Indigo Plant) పౌడర్, మిశ్రమాన్ని వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా దీనిని వినియోగించడం వల్ల జుట్టు రాలడం కూడా తగ్గుతుందని నిపుణులు తెలుపుతున్నారు.
తెల్ల జుట్టును నాచురల్‌గా నల్లగా మార్చే నీలి మొక్కలో చాలా రకాల ఆయుర్వేద గుణాలు దాగి ఉన్నాయి. దీని నుంచి తీసిన పౌడర్‌ని జుట్టుకు వినియోగించడం వల్ల వెంట్రుకలు కుదుళ్ల నుంచి బలంగా మారుతాయి.
నీలి ఆకుల్లో (Indigo Plant) గ్లైకోసైడ్స్ సమ్మేళనాలు అధిక మోతాదులో లభిస్తుంది. కాబట్టి ఈ ఆకులను జుట్టుకు వినియోగించడం వల్ల జుట్టు రాలడం తగ్గి, ఊడిపోయిన జుట్టు కూడా తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.