Dhantrayodashi 2023: ధన త్రయోదశి రోజు బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా?..ఇదే శుభ ముహూర్తం..

Dhantrayodashi 2023: ధన త్రయోదశి రోజు బంగారం కొనుగోలు చేయడం చాలా శుభప్రదమని పురాణాల్లో పేర్కొన్నారు. ఈ రోజు బంగారం కొనుగోలు చేసేవారి సంపద రెట్టింపు అవుతుందని భక్తుల నమ్మకం. అయితే ఏయే సమయంలో బంగారం కొనడం శుభప్రదమే మనం ఇప్పుడు తెలుఉకుందాం.

  • Nov 09, 2023, 18:14 PM IST

Dhantrayodashi 2023: హిందూ సంప్రదాయంలో ధన త్రయోదశికి ప్రత్యేక ప్రాముఖ్య ఉంది. ప్రతి సంవత్సరం దీపావళికి రెండు రోజుల ముందు వచ్చే కృష్ణ పక్షంలోని త్రయోదశి రోజున ఈ పండగను జరుపుకుంటారు. ఈ సంవత్సరం నవంబర్ 10న ధన త్రయోదశి వస్తోంది. అయితే ఈ పండగ ప్రత్యేకత ఏమిటో..ఏయే సమయాల్లో లక్ష్మిపూజ చేయడం శ్రేయస్కరమో, బంగారం కొనడానికి శుభసమయం ఎప్పుడో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1 /5

పూర్వీకుల నుంచి ధన త్రయోదశి రోజున లక్ష్మిదేవి, కుబేరుడిని పూజించడం ఆనవాయితి..కాబట్టి ఈ సమయంలో ప్రత్యేక పూజలు చేసి ఉపవాసాలు ఆచరించడం వల్ల వ్యక్తిగత జీవితంలో అనేక మార్పులు వస్తాయి. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు దూరమవుతాయని పూరణాల్లో పేర్కొన్నారు.  

2 /5

ధన త్రయోదశి రోజున బంగారం, వెండి లేదా ఆభరణాలను కొనుగోలు చేయడం ఆనవాయితిగా వప్తోంది. ఈ రోజు బంగారం కొనుగోలు చేయడం వల్ల సంపద 13 రెట్లు పెరుగుతుందని భక్తుల నమ్మకం. 

3 /5

ధన త్రయోదశి రోజున లక్ష్మీదేవిని, కుబేర స్వామిని ప్రత్యేక పూజ ముహూర్తంలోనే పూజించాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం నవంబర్‌ 10 సాయంత్రం 5:47 నుంచి 7:45 వరకు ఉన్న శుభ సమయాల్లో పూజించడం చాలా శుభప్రదం.  

4 /5

ధన త్రయోదశి ఉపవాసాలు పాటించేవారు కూడా ప్రత్యేక సమయాల్లో మాత్రమే పూజా కార్యక్రమాలు ప్రారంభించాల్సి ఉంటుంది. నవంబర్‌ 10 తేదిన శుభం ముహూర్తం  సాయంత్రం మధ్యాహ్నం 12:35 నుంచి ప్రారంభమవుతుంది.    

5 /5

ధన త్రయోదశి రోజు బంగారం కొనాలనుకునేవారు శుభ సమయాల్లో కొనుగోలు చేయాల్సి ఉంటుంద. ఈ సంవత్సరం బంగారం కొనడానికి అనుకూల సమయం..నవంబర్‌ 10న ఉదయం 11:57 నుంచి రోజంతా కొనుగోలు చేయోచ్చు.