Upcoming IPO: వచ్చేవారం లాంచ్ కానున్న 5 ఐపీవోలు, షేర్ ధర ఇలా

Upcoming IPO: షేర్ మార్కెట్ అనేది చాలా అంతుబట్టని మార్కెట్. ఎప్పుడు ఏమౌతుందో అర్ధం కాదు. ప్రతి వారం కొత్త కొత్త ఐపీవోలు మార్కెట్‌లో ప్రవేశిస్తుంటాయి. కొన్ని అద్భుతమైన రిటర్న్స్ ఇస్తే కొన్ని నష్టాలు చేకూరుస్తుంటాయి. వచ్చేవారం మార్కెట్‌లో ఎంట్రీ ఇవ్వనున్న ఐదు ఐపీవోల గురించి తెలుసుకుందాం..

Upcoming IPO: వచ్చే వారం అంటే నవంబర్ 20-24 తేదీల్లో షేర్ మార్కెట్‌లో 5 కొత్త ఐపీవోలు లాంచ్ కానున్నాయి. దీపావళి తరువాత లాంచ్ కానున్న ఐపీవోలు కావడంతో మార్కెట్‌లో ఈ షేర్లపై చాలా అంచనాలున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

1 /5

ఫ్లేయర్ రైటింగ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఐపీవో నవంబర్ 22న ఓపెన్ అయి నవంబర్ 24న క్లోజ్ కానుంది. ప్రతి ఈక్విటీ షేర్ 288 నుంచి 304 రూపాయలు మధ్యలో ఉండవచ్చు. 

2 /5

ఫెడ్ బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఐపీవో నవంబర్ 22 న లాంచ్ కానుంది. నవంబర్ 24న క్లోజ్ అవుతుంది. షేర్ విలువ 133 నుంచి 140 మధ్యలో ఉంటుంది. 

3 /5

టాటా టెక్నాలజీస్ ఐపీవో కోసం చాలామంది నిరీక్షిస్తున్నారు. నవంబర్ 22న ఓపెన్ అయి 24వ తేదీన క్లోజ్ కానుంది. ఇది కూడా 2 రూపాయల ఫేస్ విలువతో ప్రతి షేర్ 475 నుంచి 500 రూపాయలుంటుంది. 

4 /5

గాంధార్ ఆయిల్ రిఫైనరీ ఇండియా ఐపీవో నవంబర్ 22న ఓపెన్ కానుంది. నవంబర్ 24న క్లోజ్ అవుతుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు నవంబర్ 21న ఉంటుంది. ఈ ఐపీవో ప్రైస్ బ్యాండ్ 2 రూపాయల ఫేస్ విలువతో ప్రతి ఈక్వీటి షేర్ 160 నుంచి 169 మధ్య నిర్ణయించారు.

5 /5

IREDA IPO ప్రైస్ బ్యాండ్ 10 రూపాయల ఫేస్ విలువతో ప్రతి ఈక్విటీ షేర్ 30-32 రూపాయలు నిర్ణయించారు. ఐపీవో నవంబర్ 21న ఓపెన్ అయి 23 క్లోజ్ కానుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు నవంబర్ 20 కేటాయింపు ఉంటుంది.