Ayodhya Railway Station: కొత్త ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్ ప్రారంభం.. అయోధ్య నగరికి కొత్త సొగసులు

Maharishi Valmiki International Airport: మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం, అయోధ్య ధామ్ పునరుద్ధరించిన రైల్వే స్టేషన్‌ను ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. అయోధ్య నగరికి కొత్త సొగసులు, సౌకర్యాలు కల్పించడంలో భాగంగా.. మోడర్న్ రైల్వేస్టేషన్, కొత్త ఎయిర్‌పోర్ట్ నిర్మించారు. 
 

  • Dec 30, 2023, 16:52 PM IST
1 /6

జనవరి 22న జరగనున్న రామాలయ మహా సంప్రోక్షణ వేడుకకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.   

2 /6

అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ రెండు అమృత్ భారత్, ఆరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నేడు ప్రారంభించారు.  

3 /6

ప్రధానమంత్రి రూ.15,700 కోట్లతో 46 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.  

4 /6

మోడర్న్ రైల్వే స్టేషన్‌లో అయోధ్య ధామ్ జంక్షన్ ఫుడ్ ప్లాజాలు, వెయిటింగ్ రూమ్‌లతో మూడు అంతస్తుల సౌకర్యంగా ఉంది.  

5 /6

అయోధ్య విమానాశ్రయం ఏడాదిలో దాదాపు 10 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించనుంది. జనవరి 6న కార్యకలాపాలు ప్రారంభించనుంది.  

6 /6

ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, అహ్మదాబాద్ వంటి ప్రధాన నగరాల నుంచి విమానాల ద్వారా భక్తులు అయోధ్య ఆలయానికి రానున్నారు.