Foods In Hyderabad: హైదరాబాద్.. తప్పకుండా తినాల్సిన వంటలు ఇవే!

Famous Food In Hyderabad: హైదరాబాద్‌ అంటే  నిజాం నవాబుల వారసత్వం,  రుచికరమైన కబాబ్‌లు, ఘుమఘుమలాడే బిర్యానీలకు పెట్టిందే పేరు. ఇక్కడి వంటకాలు మరి ఎక్కడ  దక్కని రుచి. 

  • Mar 09, 2024, 22:14 PM IST
1 /5

బిర్యానీ హైదరాబాద్‌ ఒక రుచికరమైన వంటకం. ఇది సుగంధభరిత  బియ్యం,  రుచికరమైన మాంసం, అద్భుతమైన  మసాలాలతో తయారు చేసే అద్భుతమైన వంటకం. హైదరాబాద్‌ అంటే బిర్యానీ.. బిర్యానీ అంటే హైదరాబాద్ అనిపించే రుచికరమైన డిష్‌ .

2 /5

రంజాన్ నెలలో  చాలా  ప్రత్యేకంగా  చేసే  విందు హలీమ్ . గోధుమ,  మాంసం,  మసాలాలు  ఇతర  పదార్థాలతో తయారు చేసే వంటకం హలీమ్‌. దీని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది.

3 /5

రుచికరమైన చాయ్,  ఎక్కువ  పాలు,  బుర్రతో  చేస్తారు. హైదరాబాద్  వీధుల్లో,  తినుబండారాలు వద్ద ఈ చాయ్‌ మనకు దొరుకుతుంది. ఈ చాయ్ కోసం ఎగబడి మరి తాగుతారు హైదారబాద్‌ జనాలు. 

4 /5

మసాలాతో  కలిపి  చేసిన   కీమా,  కూరగాయలతో నింపిన వేయించిన పొట్లాలను లుక్మీ అంటారు. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది. సాయంత్రం  చాయ్‌ తో పాటు తీసుకొనే ఆహారం. చాలా మంది తీసుకుంటారు. 

5 /5

హైదరాబాద్‌లో ప్రతిఒకరికి నచ్చే స్ట్రీట్ ఫుడ్  బోటీ కబాబ్‌లు. మెరినేట్ చేయబడిన మాంసం ముక్కలు, దీని  స్కేవర్‌లపై కాల్చి తింటే ఎంతో రుచిగా ఉంటుంది.