Numbness: చేతులు, కాళ్లల్లో తిమ్మిర్లు వస్తున్నాయా? ఈ 5 ఫుడ్స్ తినండి..

Numbness remedy: చాలామందిలో చేతులు కాళ్లలో తిమ్మిర్లు రావడం మనం చూసే ఉంటాం. ఇది బ్లడ్ సర్క్యూలేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల జరుగుతుంది. దీనికి ఆహారంలో కొన్ని మార్పులు చేసి చూడండి. దీంతో చేతుల్లో కాళ్లలో తిమ్మిర్ల సమస్య ఉండదు. అవేంటో తెలుసుకుందాం.
 

1 /5

ఇందులో ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. రక్తనాళాల్లోకి రక్తాన్ని సరఫరాను నిర్వహిస్తుంది. ఒమేగా 3 రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. అందుకే కాళ్లల్లో చేతుల్లో తిమ్మిర్లి అనుభవించేవారు మకేరల్, ట్యూనా, మంచినీటిలో ప్రవహించే చేపలను డైట్లో చేర్చుకోవాలి.  

2 /5

ఉల్లిపాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ మన శరీరంలో రక్తసరఫరా సక్రమంగా జరగడానికి సహాయపడుతుంది.  

3 /5

విటమిన్ సీ మన శరీరానికి ఎంతో అవశ్యకమైన పోషకాలు. ఇది కూడా రక్తంలో గడ్డ కట్టకుండా కాపాడుతుంది. రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. నిమ్మకాయ, బత్తాయి, కమలపండు, గ్రేప్స్, ఉసిరికాయలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది.  

4 /5

ఇవి ఆరోగ్యానికి ఎంతో బాగా పనిచేస్తాయి. గుండె ఆరోగ్యాన్ని కూడా నట్స్ కాపాడతాయి. ఇందులో మెగ్నీషియం, పొటాషియం, అర్జినైన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి.  వాల్‌నట్స్, హేజల్‌నట్, జీడిపప్పు, బాదం తినడం వల్ల కాళ్లు, చేతుల్లో తిమ్మిర్ల సమస్య ఉండదు.

5 /5

గుండె ఆరోగ్యం, బ్లడ్ ప్రెజర్ రెండిటికీ చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. హైబీపీతో బాధపడేవారు వెల్లుల్లి తినమని చెబుతారు. హైబీపీ ఉన్నవారు వెల్లుల్లి తింటే వెల్లుల్లిలో ఉండే సల్ఫర్  బీపీని తగ్గిస్తుంది. రక్తనాళాలకు రిలాక్స్ ఇచ్చి రక్త సరఫరాను మెరుగురుస్తాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )