Vande Bharat Sleeper Trains: దేశంలో సెమీ హైస్పీడ్ రైళ్లుగా పట్టాలెక్కిన వందేబారత్ రైళ్లు మంచి ఆదరణ పొందుతున్నాయి. వందేభారత్ రైళ్లకు లభిస్తున్న ఆదరణతో రైల్వే శాఖ ఇప్పుడు వందేభారత్ స్లీపర్ రైళ్లు ప్రవేశపెట్టనుంది.మార్చ్ వరకూ మొదటి వందేభారత్ స్లీపర్ రైలు ప్రారంభం కావచ్చని అనుకున్నా..ఇప్పుడు కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.
ఒక కోచ్‌లో దాదాపు 67 మంది ప్రయాణీకులకు స్థానముంటుంది. కొత్త వందేభారత్ స్లీపర్ కోచ్ స్టెయిన్ లెస్ స్టీల్‌తో నిర్మితమై..ఎక్కడైనా ఢీ కొడితే తట్టుకునే ఎలిమెంట్స్, ఆటోమేటిక్ అవుట్ డోర్, సెన్సార్ ఆధారిత ఇంటర్ కమ్యూనికేషన్ డోర్ ఉంటాయి. రైలు ఎక్కడం దిగడం కూడా చాలా సులువుగా ఉంటుంది.
వందేభారత్ స్లీపర్ రైలులో కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క కోచ్ తయారీకు 10 కోట్లు ఖర్చవుతుందని అంచనా.
కానీ ఇప్పుడు వందేభారత్ స్లీపర్ కోచ్ బాడీ ఎక్కువ ఎత్తు కలిగి ఉంటుంది. ప్రయాణీకుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని కోచ్‌ను రీ డిజైన్ చేశారు. మరో ఆరు నెలల తరువాత వందేభారత్ స్లీపర్ కోచ్ ట్రయల్ రన్ ఉంటుంది. ట్రయల్ రన్ విజయవంతమైన తరువాత పట్టాలెక్కనుంది.
ఇటీవలే కేంద్ర రైల్వే శాఖ మంత్రి వందేభారత్ స్లీపర్ కోచ్ గురించి వివరించారు. సాధారణంగా స్లీపర్ కోచ్‌ల ట్రైన్ పైకప్పుకు , అప్పర్ బెర్త్ కు మధ్య గ్యాప్ తక్కువగా ఉండటంతో ప్రయాణీకులకు అసౌకర్యంగా ఉంటోంది.