Vodka: అసలు వోడ్కా చరిత్ర ఏంటో మీకు తెలుసా..!

 History Of Vodka: నేటికాలంలో వయసుతో సంబంధం లేకుండా తీసుకోనే డ్రింక్స్‌లో  వోడ్కా ఒకటి. దీని కోసం భారీగా ఖర్చు చేసేవారు కూడా ఉంటారు. అయితే అసలు ఈ వోడ్కా చరిత్ర ఏంటో మీకు తెలుసా..

  • Mar 25, 2024, 16:00 PM IST

 History Of Vodka: ప్రస్తుత కాలంలో చాలా మంది పార్టీలల్లో, పబ్‌లో ఎక్కువగా తీసుకొనే డ్రింక్‌లో వోడ్కా ఒకటి. ఇది ఒక ఆల్కహాలిక్ పానీయం. పోలాండ్, రష్యా రెండు దేశాలు వోడ్కా మూలాలను తమదాసు చేసుకుంటాయి. పోలాండ్‌లో, 14వ శతాబ్దం చివరిలో "వోడ్కా" అనే పదం మొదటిసారిగా రాజ న్యాయస్థానం  రికార్డులలో కనిపిస్తుంది. రష్యాలో, 9వ శతాబ్దంలో సన్యాసులు వోడ్కా లాంటి డ్రింక్‌ను తయారు చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. 

1 /5

* మొదట్లో, వోడ్కాను ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగించేవారు. యాంటీసెప్టిక్  నొప్పి నివారణగా ఉపయోగించే వారు. * మతపరమైన కార్యక్రమాలలో కూడా దీనిని ఉపయోగించేవారు.  

2 /5

* 15వ శతాబ్దం నాటికి  వోడ్కా సాధారణ ప్రజలలో మరింత ప్రాచుర్యం పొందింది. * 18వ శతాబ్దంలో రష్యన్ ప్రభుత్వం వోడ్కా ఉత్పత్తిని నియంత్రించడం ప్రారంభించింది. దీనిని ఒక ముఖ్యమైన ఆదాయ వనరుగా మార్చింది.

3 /5

* 19వ శతాబ్దంలో, వడకట్టడం Distillate చేసే పద్ధతులలో మెరుగుదలలు వోడ్కాను మరింత స్పష్టంగా, రుచిలేకుండా చేసింది. * 20వ శతాబ్దంలో, వోడ్కా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. * నేడు వోడ్కా అనేది అనేక కాక్‌టెయిల్‌లలో ఒక ప్రధాన పదార్ధం దాని స్వంతంగా కూడా తాగుతారు.

4 /5

* భారతదేశంలో, వోడ్కా 19వ శతాబ్దంలో బ్రిటిష్ వారి ద్వారా పరిచయం చేయబడింది. * ఇది ఇటీవలి దశాబ్దాలలో ప్రాచుర్యం పొందింది, ముఖ్యంగా యువతలో. * భారతదేశంలో, వోడ్కాను ఎక్కువగా స్ప్రైట్‌తో కలిపి తాగుతారు.  

5 /5

* ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన మద్యపానాలలో ఒకటి. * 40% ఆల్కహాల్ శాతంతో ఉండేది సాధారణం. * పులియబెట్టిన ధాన్యాలు, బంగాళాదుంపలు లేదా పండ్ల నుంచి తయారు చేయవచ్చు.