YS Jagan Pulivendula: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2029 ఎన్నికల్లో పులివెందుల నుంచి పోటీ చేయలేరా..? డీమిలిటేషన్లో పులివెందుల ఎస్సీ నియోజకవర్గంగా మారుతోందా..? రాయలసీమలో జగన్ కొత్త అడ్డా వెతుక్కోవాల్సిందేనా..? ఏపీలో జరగనుంది..?
YS Jagan Slipped In Bhimavaram: ఆక్వా రైతుల కోసం భీమవరంలో నిర్వహించిన సభలో పాల్గొన్న వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తుళ్లి పడిపోయారు. సభకు భారీ ఎత్తున మత్య్సకారులు, ప్రజలు తరలిరావడంతో మాజీ సీఎం వైఎస్ జగన్ దాదాపుగా కిందపడిపోయేవారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని పట్టుకున్నారు. ఈ సభలో పెద్ద ఎత్తున అభిమానులు పోటెత్తడంతో వారిని నియంత్రించడానికి పోలీసులకు చుక్కలు కనిపించాయి.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు భీమవరం, కిర్లంపూడిపర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభంభౌతికకాయానికి నివాళులర్పించనున్నారు. అంతకు ముందే ఆక్వా రైతులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈరోజు ఆయన చేపట్టబోయే భీమవరం, కిర్లంపూడి పర్యటనలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
YS Jagan Phone Call To Fishermen Chinna: విశాఖపట్టణంలో సముద్రంలో గల్లంతై సురక్షితంగా బయటపడిన మత్య్సకారుడు చిన్నతో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. ప్రమాదం నుంచి బయటపడిన చిన్నతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదం ఎలా జరిగిందో ఆరా తీశారు.
AP Capital Issue News: 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పునవ్యవస్థీకరణ తర్వాత దాదాపుగా 10 ఏళ్ల తర్వాత రాజధానిపై ప్రత్యేక గెజిట్ తేవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే రాష్ట్రం విడిపోయి 12 ఏళ్లు గడుస్తున్నా నేటికి రాజధాని అంశంపై సగటు మనిషికి క్లారిటీ రావడం లేదు. అయితే రాజధాని ఏర్పాటు వైఫల్యానికి కారణం ఎవరు?
YSRCP Chief Ys Jagan Meets Kranti Kumar Family:పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న క్రాంతి కుమార్ కుటుంబానికి న్యాయం జరిగేలా తాను చూస్తానని.. ఆ కుటుంబానికి తాను అండగా ఉంటానని మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు.
YS Jagan Slams To Chandrababu A Head Vizag Steel Plant Accident: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ కాకుండా తామే అడ్డుకున్నట్లు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చేది ఏమీ లేదని.. న్యాయబద్దంగా ఇవ్వాల్సినవే ఇస్తున్నారని పేర్కొన్నారు.
YSRCP Chief And ExCM YS Jagan Once Again Hot Comments On MAVIGUN: అమరావతి రాజధాని పేరిట రైతులను బలవంతపెడుతున్నారని కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని పేరిట ప్రభుత్వ అన్యాయానికి బలవుతున్న రైతులకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అమరావతి బాధిత రైతులు ఆయన ముందు గోడు వెళ్లబోసుకున్నారు.
MLC Perabathula Rajasekhar: పేరాబత్తుల రాజశేఖర్ మాజీ ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్ర రాజకీయాలు, పరిపాలనకు సంబంధించిన పలు అంశాలపై స్పందించిన ఆయన.. జగన్ తీసుకున్న నిర్ణయాలపై ప్రశ్నలు లేవనెత్తారు. ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రభుత్వ పనితీరుపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. పేరాబత్తుల రాజశేఖర్ వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాల్లో మరోసారి వేడి పెరిగింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
YS Jagan Press Meet Today: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న తరుణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో అత్యంత ఘోరమైన పాలన నడుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Byreddy Siddharth Reddy Case: కర్నూలు జిల్లాలో పొలిటికల్ హీట్ పెరిగింది. రాయలసీమ రాజకీయాల్లో వైసీపీ నుంచి ప్రచారంలో ఉన్న బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై ఇప్పుడు క్రిమినల్ కేసు నమోదయ్యింది. మంత్రి టీజీ భరత్‌తో పాటు ఆయన కుటుంబంపై బెరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. దీనిపై సీరియస్ గా తీసుకున్న మంత్రి టీజీ భరత్.. సిద్ధార్థ్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
YS Jagan Forgot His Mother YS Vijayamma Birthday: సొంత తల్లి జన్మదినాన్ని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరచిపోయారు. జన్మనిచ్చిన తల్లిని దూరం చేసుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తల్లి బర్త్‌డేకు విష్ చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే షర్మిలతోపాటు నారా లోకేశ్ విష్ చేయడం గమనార్హం. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
PM Modi On Pawan Kalyan Health: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు జరిగిన సర్జరీపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. తాజాగా పవన్ కళ్యాణ్‌తో మాట్లాడిన ప్రధాని మోదీ.. ఆయన ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతం త్వరగా కోలుకోవాలని ఆయన ట్వీట్ చేశారు.
YS Jagan On Pawan Kalyan Health: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి తాజాగా సర్జరీ అయిన సంగతి తెలిసిందే. ఇటీవలే పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురైన నేపథ్యంలో ఆయన్ని హుటాహుటిన హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత సర్జరీ అవసరమని వైద్యులు సూచించడంతో వెంటనే సర్జరీ చేశారు. అయితే ఇదే విషయమై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ సోషల్ మీడియాలో స్పందించారు.
ys jagan fires on chandrababu naidu: తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జర్నలిస్టులపై మీకెందుకు అంత కక్ష?.. అని, వాళ్లు ఏమైనా మీరు చేయనిది చెప్పారా?.. అంటూ ఏపీ సీఎం చంద్రబాబుపై జగన్ చేసిన ట్విట్ వార్తలలో నిలిచింది.
Ap high court remands pudi srihari: కుప్పం కోర్టు తీర్పును ఏపీ హైకోర్టు కొట్టివేసింది. అంతేకాకుండా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా జనరల్ సెక్రటరీ పూడి శ్రీహరితో పాటు, గిరిశ్ కుమార్ రెడ్డిలకు రిమాండ్ విధించింది.
YS Jagan Mohan Reddy: సీఎం చంద్రబాబు నాయుడిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. తన కొడుకు నారా లోకేష్ స్విమ్మింగ్ పూల్స్ వద్ద తాగుతూ, తూలుతూ అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తే ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని.. తన బావమరిది బాలకృష్ణ నీచంగా మాట్లాడితే పట్టించుకోలేదని విమర్శించారు. బాలకృష్ణను లాగి కొట్టకుండా చంద్రబాబు హ హ అని నవ్వుతున్నాడని.. చిన్నప్పుడు తాను ఇంతకంటే ఎక్కువే చేశానని చంద్రబాబు అన్నాడని గుర్తు చేశారు.
Telangana Deputy CM Meets Ex CM YS Jagan: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ జగన్‌ను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిశారు. తన కుమారుడి వివాహానికి సంబంధించి ఆహ్వాన పత్రిక అందించి భట్టి విక్రమార్క ఆహ్వానం పలికారు. హైదరాబాద్‌లో జరగనున్న తన కొడుకు పెళ్లికి జగన్‌ను పిలిచారు.
YS Jagan Attends Konduru Ajay Reddy Son Wedding: నెల్లూరు జిల్లాలో జరిగిన వివాహ వేడుకకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరయ్యారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి (రైల్వే కోడూరు) కుమారుడి వివాహ వేడుకకు హాజరైన మాజీ సీఎం వైఎస్ జగన్ కొత్త దంపతులను ఆశీర్వాదం చేశారు.
AP Politics: ఏపీలో క్యాస్ట్ పాలిటిక్స్ మళ్లీ మొదలయ్యాయి..! ఎన్నికలకు మరో మూడేళ్లు సమయం ఉండగానే.. ఆ సామాజివకర్గం చుట్టూ పొలిటికల్ గేమ్ స్టార్ట్ అయ్యింది..! ముఖ్యంగా వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు తర్వాత.. కాపులంతా వైసీపీ వైపు మళ్లారన్న చర్చ జరుగుతోంది..! అటు టీడీపీ నేత, వంగావీటి రాధా కూడా వైసీపీ నేతలకు కాపులంతా అండగా ఉండాలని పిలుపునివ్వడంతో.. రాజకీయం మరింత హీటెక్కింది..! ఇంతకీ కాపులంతా ఫ్యాన్ పార్టీ నీడకు వచ్చినట్టేనా..!
Kethireddy Mass Warning: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేసి వెళ్లిన నేతలపై ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీకి అండగా నిలవాల్సిన సమయంలో పక్కకు తప్పకుని..ఇప్పుడు అవకాశాల కోసం మళ్లీ పార్టీ పంచనా చేరాలనుకోవడం అస్సలు అంగీకారయోగ్యం కాదన్నారు. మన దగ్గర సంపాదించుకుని.. పక్క పార్టీల్లోకి వెళ్లి.. ఇప్పుడు బంధుత్వాలు, స్నేహం పేరుతో మళ్లీ వైసీపీ వైపు చూస్తామంటే.. గేటు దగ్గరే ముఖంపై చెప్పుతో కొడతాం అంటూ వార్నింగ్ ఇచ్చారు.
Ambati Rambabu: తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో అంబటి రాంబాబు బుధవారం బెయిల్‌పై విడుదల అయ్యారు. తాజాగా ఈయన ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ తో భేటి అయ్యారు.