Watermelon Peel Benefits: ఈ వేసవి వేడిమిని తాళలేక అందరు చల్లని పానియాలు, పండ్లను తినాలని కోరుకుంటారు. అయితే, ఓ పండు మన దాహాన్ని తీర్చడమే కాకుండా బరువు పెరగకుండా ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.
Watermelon Peel Benefits: ఈ వేసవి వేడిమిని తాళలేక అందరు చల్లని పానియాలు, పండ్లను తినాలని కోరుకుంటారు. అయితే, ఓ పండు మన దాహాన్ని తీర్చడమే కాకుండా బరువు పెరగకుండా ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. అదే పుచ్చకాయ ఎండకాలం మార్కెట్లో కూడా విపరీతంగా పుచ్చకాయలు అందుబాటులో ఉంటాయి. పుచ్చకాయలో 90 శాతానికి పైగా నీరు ఉంటుంది. ఈ సమ్మర్ ఫ్రూట్ ను మీ డైట్లో చేర్చుకుంటే గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
పుచ్చకాయలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. దీంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వేసవి అలసట నుంచి పుచ్చకాయ మనల్ని కాపాడుతుంది. ఇలా సీజనల్ ఇన్ఫెక్షన్ల నుంచి కూడా బయటపడొచ్చు.
అయితే, సాధారణంగా అందరూ పుచ్చకాయ తిని ఆ తొక్కను పాడేస్తారు. దీంతో రెట్టింపు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని మీకు తెలుసా? నిజం..ఈ విషయాలు తెలిస్తే ఈసారి తొక్కను కూడా పారేయకుండా తింటారు. ఈ తొక్కలో విటమిన్ సీ అధికంగా ఉంటుంది. దీంతో ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది.
పుచ్చకాయను మన డైట్లో చేర్చుకోవడం వల్ల స్ట్రెస్ నుంచి కూడా బయటపడొచ్చు. అంతేకాదు పుచ్చకాయ తొక్కలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది బ్లడ్ ప్రెజర్‌ను పెరగనివ్వకుండా కాపాడుతుంది. ఇది బీపీ సమస్య ఉన్నవారికి ఓ వరం. తీవ్రం ఒత్తిడి బారినపడినవాళ్లు కూడా పుచ్చకాయ తీసుకోవాలి.
ఇక వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవారు పుచ్చకాయతోపాటు తొక్కను డైట్లో చేర్చుకోవాలి. వర్కౌట్ తర్వాత మంచి స్నాక్‌గా పనిచేస్తుంది. ముఖ్యంగా పుచ్చకాయ తింటే ఎక్కువ సమయం కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దీంతో అతిగా తినం. పుచ్చకాయ తొక్కలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి.
పుచ్చకాయ తొక్కను ముఖానికి రుద్దడం వల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇందులో విటమిన్ సీ వల్ల ముఖాన్ని హైడ్రేటేడ్‌గా ఉంచుతుంది. అంతేకాదు, ముఖానికి తాజాదనాన్ని ఇస్తుంది. ఈసారి పుచ్చకాయ తిన్నప్పుడు పండు తిని తొక్కను పారేయకండి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )