Homeremedies for Acid Reflux in summer: సాధారణంగానే కాస్త కారం ఉండే ఆహారాలు తీసుకుంటే కడుపులో మంట మొదలవుతుంది. ప్రస్తుతం వేసవికాలం మరింత జాగ్ర్తలు తీసుకోవాలి.
Homeremedies for Acid Reflux in summer: సాధారణంగానే కాస్త కారం ఉండే ఆహారాలు తీసుకుంటే కడుపులో మంట మొదలవుతుంది. ప్రస్తుతం వేసవికాలం మరింత జాగ్ర్తలు తీసుకోవాలి. మీకు కూడా యాసిడ్ రిఫ్లక్షన్ సమస్య వస్తే ఈ వంటగది వస్తువుతో చెక్ పెట్టండి..ఎందుకంటే ఇది రానురాను గుండెలో కూడా మంటను కలిగిస్తుంది.
ముఖ్యంగా వేసవి కాలం ఆహారాన్ని బాగా నమిలి తినాలి. మీరు ఏ ఆహారం తిన్నా ఆ తర్వాత నిమ్మరసం తాగడానికి ప్రయత్నించండి. ఇది వేసవి నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. అలాగే యాసిడ్ రిఫ్లక్స్ కాకుండా కాపాడుతుంది. నిమ్మకాయలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది.
చియా సీడ్స్ ఈ కాలంలో వేడిని తట్టుకోలేక చాలామంది ఉపయోగిస్తున్నారు. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. మన శరీర ఉష్ణోగ్రతను సైతం చల్లబరుస్తుంది. చియా గింజలను ఓ ఆరుగంటలకు ముందుగా నీటిలో నానబెట్టి తీసుకోవాలి. లేదా ఏదైనా సలాడ్స్ లో వేసుకోవాలనుకుంటే మీకు ఎక్కువ సమయం లేకపోతే రెండు గంటల ముందు నానటెబెట్టుకుని చల్లుకోవాలి.
ఎండకాలం కొన్ని రకాల పానియాలు తీసుకోవడం వల్ల కూడా యాసిడ్ రిఫ్లక్స్‌కు గురికాకుండా ఉంటారు. ముఖ్యంగా ఆమ్‌పన్నా, మజ్జిగ వంటివి మీ డైట్లో చేర్చుకుంటే యాసిడ్ రిఫ్లక్స్‌కు గురికాకుండా ఉంటారు. ఇవి కడుపునకు ఆరోగ్యవంతం చేస్తాయి.
వేసవిలో ఎండ వేడిమిని తట్టుకోవాలన్నా, యాసిడ్ రిఫ్లక్స్‌కు గురికాకుండా ఉండాలన్నా కొత్తిమీర, జిలకర్ర, మెంతులు వేసి స్టవ్‌పై పెట్టి బాగా మరిగించుకోవాలి. సగం అయ్యాక ఈ నీటిని తీసుకునేటప్పుడు ఇందులో కాస్త నిమ్మరసం కూడా కలిపితే రుచి బాగుంటుంది.
వేసవిలో కలబంద రసం కూడా డైట్లో చేర్చుకోండి. ఎందుకంటే ఇది కూడా కడుపును చల్లబరుస్తాయి. పుదీనాతో తయారు చేసిన పానియాలు తీసుకోవాలి. పుదీనా ఆకులను మరిగించి ఆ నీటిని కూడా తీసుకోవచ్చు. ఇది మంచి డిటాక్స్ వాటర్ మాదిరి పనిచేస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )