Summer Tourism Tips: వేసవిలో ఈ 6 పర్యాటక ప్రాంతాల సందర్శన నరకమే

Summer Tourism Tips: వేసవి వెకేషన్ నడుస్తోంది. సెలవులు కావడంతో అందరూ రిలాక్స్ అయ్యేందుకు బంధువుల ఇంటికో లేదా పర్యాటక ప్రదేశాలతో తిరుగుతుంటారు. వేసవి కాలం కావడంతో ఎక్కడికి వెళ్తే బాగుంటుందనేది తెలుసుకోవాలి. కొన్ని ప్రాంతాలకు వేసవిలో వెళ్లడం అంత ఆమోదయోగ్యం కాదంటారు. అవేంటో చూద్దాం.

1 /6

డార్జిలింగ్ డార్జిలింగ్ అందమైన లోయలు, పర్వత ప్రాంతాలకు ప్రతీతి. అందుకే పర్యాటకులు పెద్దఎత్తున వస్తుంటారు. అయితే మే-జూన్ నెల డార్జిలింగ్ సందర్శనకు అంత అనువైంది కాదు. భారీ వర్షాలుండవచ్చు మీరు ట్రిప్ ఎంజాయ్ చేయలేరు

2 /6

రాజస్థాన్ రాజస్థాన్ అంటేనే రాచరికం, వైభవం, చరిత్రకు ప్రతీతి. కానీ వేసవిలో ఇక్కడి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి ఉంటాయి. దాంతో తిరిగేందుకు ఇబ్బంది ఎదురౌతుంది. 

3 /6

ఆగ్రా ఆగ్రాలోని తాజ్‌మహల్ ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన పర్యాటక ప్రాంతం. వేసవిలో తిరిగేందుకు అనువుగా ఉంటుంది. భీకరమైన వేడి కారణంగా సందర్శకులకు కష్టమౌతుంది. ట్రిప్ ఎంజాయ్ చేయలేని పరిస్థితి ఉంటుంది. 

4 /6

కచ్ దేశంలోని అతి పెద్ద ధార్ ఎడారి ప్రాంతమిది. ఎడారి ప్రాంతాలు దర్శనీయమే అయినా వేసవిలో కానేకాదు వేసవిలో ఇక్కడి వాతావరణం 50 డిగ్రీలకు చేరుతుంటుంది. వడగాల్పులు భయంకరంగా ఉంటాయి.

5 /6

గోవా సాధారణంగా చాలామంది వేసవిలో గోవా ట్రిప్ వేస్తుంటారు కానీ ఏప్రిల్-మే  నెలల్లో ఇక్కడి వాతావరణం తిరిగేందుకు అంత మంచిదికాదు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండి ఉక్కపోత అధికంగా ఉంటుంది. 

6 /6

కాన్హా నేషనల్ పార్క్ పులులకు ప్రసిద్ధి చెందిన కాన్హా నేషనల్ పార్క్ వేసవిలో సందర్శించడం అంత మంచిది కాదు. ఇదొక సఫారీ జంగిల్. వేసవి కాలం కావడంతో ఇవి బయటకు రావు. సో మీ ట్రిప్ వృధా కావచ్చు.