Natural shampoo: ఇంట్లోఈ 3 వస్తువులు ఉంటే హెయిర్ షాంపూ అవసరమే ఉండదు..

Natural shampoo at home: బిజీ లైఫ్ లో హడావిడిగా తలస్నానం చేస్తూ ఆఫీస్ బయలుదేరుతూ ఉంటారు .అయితే ఎలాంటి షాంపూలు వాడాలి? సరైన ఉత్పత్తుల్లో కూడా చూసుకోలేని పరిస్థితి ఒక్కోసారి నెలకొంటుంది. సాధారణంగా మన జుట్టుకు సున్నితంగా ఉండే మైల్డ్ షాంపూలు మాత్రమే వినియోగించాలి.
 

1 /5

అతిగా కెమికల్ ఉండే షాంపూలు వినియోగిస్తే హెయిర్ ఫాల్ సమస్యలు వెంటాడుతాయి. చర్మసంబంధిత సమస్యలు కూడా వస్తాయి. అయితే ఇంట్లోనే కొన్ని వస్తువులు హెయిర్ షాంపూలా పనిచేస్తాయని మీకు తెలుసా?  

2 /5

ఉసిరికాయ, కుంకుడుకాయ,షీకాకయ్ మన అమ్మమ్మల కాలం నుండి తరతరాలుగా హెయిర్ షాంపూ చేయడానికి వినియోగిస్తారు. మనకు మార్కెట్లో ఈ ఉత్పత్తులు ఉండే హెయిర్ కేర్ షాంపూలు కూడా అందుబాటులో ఉంటాయి.షాంపూ లేని సమయంలో ఈ మూడింటిని కలిపి హెయిర్ షా షాంపుల వినియోగిస్తే అద్భుత ప్రయోజనాలు ఉంటాయి.  

3 /5

దీనివల్ల హెయిర్ ఫాల్ సమస్యలు ఉండవు. చుండ్రు కూడా దరిచేరదు. అన్ని సూపర్ మార్కెట్లలో ఈ మూడు అందుబాటులో ఉంటాయి. అంతేకాదు ఉసిరికాయ, కుంకుడకాయ పొడులు కూడా అందుబాటులో ఉంటాయి. వీటితో మనం షాంపూ తయారు చేసుకోవచ్చు. కుంకుడు కాయలు పగలకొట్టి ఉడకబెట్టి షాంపూలు తయారు చేసుకుంటారు.  

4 /5

అయితే రాత్రంతా వీటిని నీళ్లలో నానబెట్టి మరుసటి రోజు ఉడకబెట్టుకోవాలి నీటిలోనే మిగతా రెండు వస్తువులు కూడా వేసి కాసేపు చల్లారనివ్వాలి. వీటిలో నుంచి గుజ్జు బాగా పిసికి రసాన్ని తీస్తే షాంపూ లిక్విడ్ తయారవుతుంది. ఈ నీటితో హెయిర్ వాష్ చేసుకుంటే జుట్టు రాలే సమస్యను అధిగమించివచ్చు.  

5 /5

 కుదుళ్ల నుంచి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు మీ జుట్టు ఆరోగ్యంగా మందంగా పెరుగుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )