Rakul Preet Singh: రెడ్ డ్రెస్సులో మెరిసిపోయిన రకుల్.. ఫిదా అవుతున్న అభిమానులు

రకుల్ ప్రీత్ సింగ్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఆమె అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
 

1 /5

రకుల్ ప్రీత్ సింగ్ కి ఈమధ్య వివాహం జరిగిన సంగతి తెలిసిందే. అయినా కానీ ఈ హీరోయిన్ కి ఇంకా క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఆమెకు తెలుగు, హిందీ ఇండస్ట్రీలో ఎంతోమంది అభిమానులు ఉన్నారు.

2 /5

సందీప్ కిషన్ హీరోగా వచ్చిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది రకుల్ ప్రీత్. ఈ సినిమాలో ‘ప్రార్థన…ప్రతి రూపాయి కౌంట్ ఇక్కడ’ అని రకుల్ చెప్పిన డైలాగ్ చాలా పాపులర్ అయింది.  

3 /5

ఆ తరువాత ఈ హీరోయిన్ వరస అవకాశాలు తెచ్చుకోవడం ప్రారంభించింది. తెలుగులో స్టార్ హీరోలు.. చిన్న హీరోలు అని తేడా లేకుండా దాదాపు అందరితోనూ నటించింది రకుల్ ప్రీత్.

4 /5

తెలుగు సినిమాలలో దూసుకుపోతున్న సమయంలోనే హిందీలోకి అడుగు పెట్టింది. ఇక హిందీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాక.. తెలుగు సినిమాలను తగ్గిస్తూ వచ్చింది ఈ హీరోయిన్.

5 /5

ఈ క్రమంలో రకుల్ మరలా తెలుగులో ఎప్పుడు కనిపిస్తుంది అని ఎదురుచూస్తున్నారు.. ఆమె అభిమానులు. మరోపక్క ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు.. వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి.