Cholesterol Control: చెడు కొలెస్ట్రాల్ గుండెకు శత్రువు.. ఈ గింజతో తక్షణమే చెక్ పెట్టొచ్చు..

Cholesterol Control Remedy: శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరిగితే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఇది గుండెపై తీవ్ర ప్రభావం చూపుతుంది. హార్ట్‌ బ్లాకేజీ, స్ట్రోక్‌ వంటి సమస్యలు కూడా వస్తాయి.
 

1 /6

రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకుని మంచి కొలెస్ట్రాల్‌ పెంచాలి. దీంతో మనం ఆరోగ్యంగా ఉంటాం. లేకపోతే కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం వల్ల గుండె జబ్బులు వస్తాయి. శరీరంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే ధమనుల గోడలపై పేరుకుపోతుంది.  ఓ ఫలకం ఏర్పడుతుంది.   

2 /6

ఇలా అధిక కొలెస్ట్రాల్ మన శరీరంలో పెరిగిపోతే దీని వల్ల గుండె, మెదడుకు రక్త సరఫరా ఇక అంత సులభంగా ప్రవహించదు. అప్పుడే గుండె సమస్యలు వచ్చి ప్రాణాలు పోయే పరిస్థితులు కూడా ఏర్పడతాయి.  

3 /6

ఇలా జరగకుండా ఉండటానికి సరైన జీవనశైలి  అనుసరించాలి. దీనికి కొన్ని రెమిడీలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించేసే గింజలు అందుబాటులో ఉన్నాయి. ఇవి డైట్లో తప్పనిసరిగా చేర్చుకోవాలి.  

4 /6

ముఖ్యంగా మీ పూర్తి ఆహారపు అలవాట్లతో పాటు చియా విత్తనాలను తీసుకోవాలి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. చీయా విత్తనాలను అనేక విధాలు తీసుకోవచ్చు. వీటిని తీసుకునే ముందు ఓ రెండు గంటలపాటు నానబెట్టుకోవాలి..  

5 /6

ఆ తర్వాత తీసుకోవాలి.వీటిని పరగడుపున తీసుకోవచ్చు. చియా విత్తనాలు ఆరోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉంటాయి. వీటిని పుడ్డింగ్‌లో కూడా వేసుకుని తీసుకోవచ్చు.  ఇవి మీ రక్తంలో HDL కొలెస్ట్రాల్ మొత్తాన్ని పెంచుతాయి  

6 /6

ఎందుకంటే ముఖ్యంగా చియా గింజల్లో కరిగే ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ జీర్ణవ్యవస్థలో కొలెస్ట్రాల్‌తో బంధిస్తుంది LDL కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )