Fatty Liver Problem: ఆధునిక జీవన విధానంలో, ఉరుకులు పరుగుల జీవితంలో చెడు ఆహారపు అలవాట్ల ప్రభావం ఆరోగ్యంపై, మరీ ముఖ్యంగా లివర్‌పై పడుతుంటుంది. ఇటీవలి కాలంలో అందుకే ఫ్యాటీ లివర్ సమస్య అధికంగా కన్పిస్తోంది. మద్యపానం ముట్టనివారిలో కూడా ఈ వ్యాధి కన్పిస్తోంది. లివర్‌లో కొవ్వు పేరుకుపోవడమే ఫ్యాటీ లివర్ సమస్య. ప్యాటీ లివర్ సమస్య ఎంత సామాన్యంగా కన్పిస్తుందో అంతే ప్రమాదకరమైంది.
ఇండియాలో ప్రతి ముగ్గురిలో ఒకరికి, ప్రతి పది మంది చిన్నారుల్లో ఒకరికి ఫ్యాటీ లివర్ సమస్య ఉందంటే మీరు నమ్ముతారా...
ఫ్యాటీ లివర్ ఉందని అనుమానంగా ఉన్నా లేక ఫ్యాటీ లివర్ లక్షణాలు ఏమైనా కన్పించినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
ఫ్యాటీ లివర్ సమస్య నుంచి కాపాడుకోవాలన్నా, చికిత్స అందించాలన్నా ప్రధానంగా చేయాల్సింది హెల్తీ లైఫ్‌స్టైల్ అలవర్చుకోవడం. ఇందులో బ్యాలెన్స్ డైట్, నిర్ణీత పద్ధతిలో వ్యాయామం, బరువు తగ్గించుకోవడం, మద్యపానానికి దూరంగా ఉండటం చేయాలి
ఫ్యాటీ లివర్ సమస్యకు చికిత్స చేయించకపోతే అది క్రమంగా విషమంగా మారుతుంది. ఇందులో లివర్ ఫైబ్రోసిస్, సిరోసిస్ వంటి వ్యాధుల ముప్పు ఉంటుంది.
ఇదొక ప్రమాదకరమైన వ్యాధికి కారణమౌతుంది. ఫ్యాటీ లివర్ ప్రారంభదశలో ఏ లక్షణాలు పెద్దగా కన్పించవు. అలసట లేదా కడుపుపై కుడివైపు తేలికపాటి నొప్పి ఉంటుంది. సాధారణంగా ఈ లక్షణాలను తేలిగ్గా తీసుకుంటుంటాం.