Malvi Malhotra: అసలు మాల్వీ మల్హోత్ర ఎవరు.. ? ఈమె బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుసా..


Malvi Malhotra: ఎన్ని సినిమాలు చేసినా రానీ గుర్తింపు రాజ్ తరుణ్ కాంట్రవర్సీతో టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది  మాల్వీ  మల్హోత్ర. ఇంతకీ ఈమె ఎవరు.. ?ఈమె రాజ్ తరుణ్ మాజీ లవర్ ను లావణ్యను నిజంగానే బెదిరించిందా ? అసలు ఈమె బ్యాక్ గ్రౌండ్  ఏమిటి ? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

1 /8

మాల్వీ మల్హోత్ర.. తెలుగులో రాజ్ తరుణ్ తో  చేస్తోన్న ‘తిరగబడరా సామి’మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా విడుదల కాకముందు ఒక్కసారిగా రాజ్ తరుణ్ ఇష్యూతో ఒక్కసారిగా పాపులర్ అయింది.

2 /8

మాల్వీ మల్హోత్రతో రాజ్ తరుణ్ డేటింగ్ చేస్తున్నాడు కాబట్టి .. తనను పట్టించుకోకుండా  మోసం చేసాడని అందుకు కారణం మాల్వీ మల్హోత్రనే అనే ఆరోపణలతో వార్తల్లో వ్యక్తిగా నిలిచింది.

3 /8

హిమాచల్ ప్రదేశ్ కు చెందిన మాల్వీ మల్హోత్ర హిందీలో తెరకెక్కిన టీవీ సీరియల్ ‘ఉడాన్’ సీరియల్ తో 2017లో  నటిగా పరిచయమైంది. ఆ తర్వాత 2018లో ‘హోటల్ మిలన్’ మూవీతో హిందీ తెరకు పరిచయం అయింది.

4 /8

ఆ తర్వాత ఒక షార్ట్ ఫిల్మ్, ఓటీటీ వేదికగా ‘జొరావర్ ది జాక్వెలిన్’ అనే ఓటీటీ మూవీలో నటించింది. 2023లో ‘అభ్యుదయం’ అనే మలయాళ మూవీలో నటించింది.

5 /8

ఇటు తెలుగులో రాజ్ తరుణ్ హీరోగా ‘తిరగబడరా సామి’ మూవీతో తెలుగు తెరకు పరిచయం అవుతోంది. ఈ సినిమా విడుదల కాకముందే రాజ్ తరుణ్ తో డేటింగ్ చేస్తోందన్న కారణంగా వార్తల్లో నిలిచింది.

6 /8

అంతేకాదు మాల్వీ వాళ్ల ఫ్యామిలీకి హిమాచల్ ప్రదేశ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో మంచి సంబంధాలే ఉన్నాయి.  

7 /8

అలా అక్కడ అధికారంలో  ఉన్న పార్టీ వాళ్లతో తనను బెదిరించినట్టు లావణ్య పేర్కింది. ఈమె సినిమాల్లో నటిస్తూనే కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ లో నటించింది.    

8 /8

మొత్తంగా తెలుగులో నటించిన తొలి సినిమా విడుదల కాకముందే.. ఇపుడు కాంట్రవర్సీ ఇష్యూతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది మాల్వీ మల్హోత్ర.