How to manage constipation: ఆధునిక జీవనశైలి, వివిధ రకాల ఆహారపు అలవాట్ల కారణంగా మలబద్ధకం ఇటీవలి కాలంలో ప్రదాన సమస్యగా మారిపోయింది. అగ్రరాజ్యంలో అయితే 20 శాతం మంది ఈ సమస్యతోనే బాధపడుతున్నారట. ఇదొక తీవ్రమైన సమస్య. మరి ఈ సమస్య నుంచి సులభంగా గట్టెక్కే మార్గాల్లేవా అంటే కచ్చితంగా ఉన్నాయి. ఆ వివరాలు మీ కోసం.
Natural Remedies to check constipation: క్రానిక్ ఇడియోపతిక్ కాన్స్టిపేషన్ అనేది కారణం తెలియని తీవ్రమైన సమస్య. ఈ పరిస్థితి ఎదురైనప్పుడు జీవనశైలిపై ప్రభావం పడుతుంది. మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగని మలబద్ఘకం సమస్య గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు చాలా సహజసిద్ధమైన పద్ధతులున్నాయి. ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం.
మలబద్ధకం నివారించేందుకు మరో మంచి పద్ధతి నెయ్యి. ఇందులో బ్యూట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉండటం వల్ల ప్రేవుల్లో మెటబోలిజం వృద్ధి చెందుతుంది. స్టూల్ మూమెంట్ మెరుగుపడుతుంది. రోజూ రాత్రి వేళ ఒక టీ స్పూన్ నెయ్యి తీసుకుంటే ఉదయం ఫలితం బాగుంటుంది
ఈ అధ్యయనం ద్వారా ఫ్లక్స్ సీడ్స్ క్రమం తప్పకుండా తినడం వల్ల బౌల్ మూమెంట్ గణనీయంగా పెరిగి మలబద్ధకం సమస్యను తగ్గించినట్టు తేలింది. ఫ్లక్స్ సీడ్స్ లో సాల్యుబుల్ ఫైబర్ గణనీయంగా ఉంటుంది. ఇది మీరు విసర్జించే స్టూల్ మృదువగా చేస్తుంది.
ఫ్లక్స్ సీడ్స్, యోగర్ట్, నెయ్యి తినడం ద్వారా మలబద్ధకం సమస్యను నివారించవచ్చని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. దీర్ఘకాలంగా మలబద్ధకం సమస్యతో బాధపడేవారిపై ఈ అధ్యయనం నిర్వహించారు.
సాధ్యమైనంతవరకూ ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, లెజ్యూమ్స్, తృణ ధాన్యాలు డైట్ లో తప్పకుండా ఉండాలి. రోజూ క్రమం తప్పకుండా తగిన వ్యవధిలో వ్యాయామం చేస్తుండాలి. తద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
అన్నింటికంటే ముఖ్యమైంది మలబద్ధకం నియంత్రించాలంటే నీళ్లు ఎక్కువగా తాగాలి. డీహైడ్రేషన్ ఓ ప్రధాన కారణం కావచ్చు. రోజూ తగినంతగా నీళ్లు తాగకపోతే విసర్జన కష్టమైపోతుంది. ఫలితంగా నొప్పి, బ్లోటింగ్ కు దారితీస్తుంది.