Thalapathy Vijay: హీరో విజయ్ కొడుకుని చూశారా? అచ్చం తండ్రిలాగే.. ఫోటోలు వైరల్..!

Hero Vijay: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తనయుడు జాసన్ సంజయ్ ఇప్పుడిప్పుడే.. ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా జాసన్ సంజయ్,  విజయ్ ఫోటోలు పక్కపక్కన పెట్టి చూడగా.. ఇద్దరిలో ఎవరు విజయ్ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని.. ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు ఫ్యాన్స్.

1 /5

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ స్టార్ హీరోగా ఒక సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.  ముఖ్యంగా తమిళ్ చిత్ర పరిశ్రమలో తన అద్భుతమైన నటనతో ఎంతో మంది ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు ఈయన కొడుకు కూడా ఇండస్ట్రీలోకి రాబోతున్నట్లు సమాచారం. 

2 /5

తాజాగా విజయ్ కొడుకు జాసన్ సంజయ్ ఇండస్ట్రీలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. విజయ్ ముద్దుల కొడుకు సంజయ్ ఫోటోలు చూసి అచ్చం తండ్రిలాగే ఉన్నాడు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. 

3 /5

జాసన్ సంజయ్ విద్యాభ్యాసం మొత్తం పూర్తి చేసి, ఆ తర్వాత కెనడాలోని శిక్షణ స్కూల్లో కొన్నేళ్లు పూర్తి చేశారు. సంజయ్ తండ్రికి తగ్గ తనయుడు.. సంజయ్ మంచి సింగర్ కూడా.. చిన్న వయసులోనే  విజయ్ నటించిన పోఖిరి చిత్రంలో వసంతముల్లై పాటతో పాటు వేడెత్త కారన్ చిత్రంలో నాన్ అడిచా తంగ మాట వంటి పాటలు కూడా పాడారు. 

4 /5

తాజాగా సంజయ్ లైకా దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైనట్లు సమాచారం. ఇక జాసన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ.. లైకా ప్రొడక్షన్స్ సినిమా నుంచి ఒక పోస్టును విడుదల చేసింది.

5 /5

ఇకపోతే తాజాగా జాసన్ సంజయ్.. అలాగే విజయ్ ఫోటోలను పక్కపక్కన పెట్టి చూస్తే ఇద్దరిలో ఎవరు విజయ్ అని పోల్చుకోలేకపోతున్నారు అభిమానులు. అచ్చం తండ్రి లాగే జాసన్, కొడుకు లాగే విజయ్  ఆశ్చర్యపరుస్తున్నారని చెప్పవచ్చు.