Mahindra Xuv.E9 Price: వావ్‌ ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 450 కిమీ మైలేజీ.. మహీంద్రా కొత్త XUV.e9 కారు వచ్చేస్తోంది!

Mahindra Xuv.E9 Price: భారత ఆటో మొబైల్‌ కంపెనీ మహీంద్రా తమ ఎలక్ట్రిక్‌ పోర్ట్‌ఫోలియోను వేగంగా ఒక్కొక్క మోడల్‌ను విడుదల చేస్తోంది. ఇప్పటికే కంపెనీ తమ కస్టమర్స్‌కి ఏడు ఎలక్ట్రిక్‌ మోడల్స్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులోనే కంపెనీ అతి త్వరలోనే XUV.e9 మోడల్‌ను లాంచ్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కారుకు సంబంధించిన అన్ని రకాల పరీక్షలను కంపెనీ ఇటీవలే తమిళనాడులో నిర్వహించింది. 

1 /7

మహీంద్రా కంపెనీ ఈ XUV.e9 కారును ఏప్రిల్ 2025 నాటికి  మార్కెట్‌లో లాంచ్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది ఎంతో శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. దీంతో పాటు  పెద్ద బూట్ స్పేస్‌ను కలిగి ఉంటుంది.

2 /7

ఇటీవలే ఈ XUV.e9 కారును పరీక్షిస్తున్న సమయంలో ఫోటోస్‌, వీడియోస్‌ లీక్‌ అయ్యాయి. ఈ లీక్‌ అయిన ఫోటోస్‌ చూస్తే ఇది ప్రీమియం సీటింగ్ లేఅవుట్‌తో రావడమే కాకుండా కార్గో స్పేస్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.   

3 /7

మహీంద్రా కంపెనీ ఈ XUV.e9 కారును INGLO ప్లాట్‌ఫారమ్‌పై రూపొందించిన్నట్లు తెలుస్తోంది. అందుకే ఇందులో పెద్ద బూట్‌ స్పేస్‌తో పాటు రెండు వరస సీట్లు అందించారు. దీంతో ఈ కారులో మొత్తం 5 సీట్లు ఉంటాయి.  

4 /7

ఈ కారులో అనేక రకాల ప్రీమియం ఫీచర్స్‌ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఇందులో రిక్లైనింగ్ ఫంక్షన్ ఫీచర్‌ను కూడా అందిస్తోంది. దీని ద్వారా బూట్ స్పేస్‌ మరింత పెరుగుతుంది.

5 /7

ఇక XUV.e9 ఇంటీరియర్ వివరాల్లోకి వెళితే, ఈ కారు క్యాబిన్‌లోని సీట్లు లైట్‌ రంగులతో పాటు లెదర్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆటోమేటిక్ గేర్ లివర్‌ను కూడా అందిస్తున్నట్లు సమాచారం.

6 /7

అలాగే ఈ కారులో 2-కప్ హోల్డర్లతో పాటు ఆటో-హోల్డ్ ఫంక్షన్‌ను కూడా అందిస్తోంది. అంతేకాకుండా ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే 2-స్పోక్ స్టీరింగ్ వీల్‌తో పాటు పెద్ద స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో ఈ XUV.e9 కారు అందుబాటులోకి రానుంది.  

7 /7

ఇక ఈ కారుకు సంబంధించిన మైలేజీ వివరాల్లోకి వెళితే, దాదాపు దీనిని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే దాదాపు 435 నుంచి  450 కిమీల వరకు మైలేజీని అందిస్తుంది. ఇక ఇది ధర రూ.38 లక్షల ఎక్స్-షోరూమ్ ఉంటుంది.