Olympics 2024: మల్లీశ్వరీ నుంచి మనుబాకర్ వరకు.. ఒలింపిక్స్ లో సత్తా చాటిన భారత మహిళా అథ్లెట్లు, గెలుచుకున్న పతకాలు..

Indian woman athlete in Olympics 2024:  ఒలింపిక్స్ ఆటలను కొన్ని వందల ఏళ్ల నుంచి జరుపుకుంటున్నాం. మొదటి ఒలింపిక్స్ 1896 లో ఏథెన్స్ లో జరిగాయి. అదే విధంగా ప్రస్తుతం మరోమారు ప్రపంచ క్రీడలకు పారిస్ వేదికగా మారింది. ఇదిలా ఉండగా.. పారిస్ లో భారత్ తన సత్తా చాటుతుంది.

1 /9

భారత దేశం నుంచి ఇప్పటి వరకు అనేక మంది క్రీడాకారులు ఒలింపిక్స్ ఆటల్లో పాల్గొని అనేక పతకాలు గెలుచుకున్నారు. ఈ నేపథ్యంలో పారిస్ లోని సెన్ నది వేదికగా జులై 26 నుంచి  ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభమయ్యాయి.   

2 /9

ఒలింపిక్స్ ఆటల్లో ఇప్పటి వరకు భారత మహిళా క్రీడాకారులు, సాధించిన పతకాల డిటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. భారత మహిళల నుంచి కరణం మల్లీశ్వరీ సిడ్నీలోజరిగిన 2000 లో జరిగిన ఒలింపిక్స్ లో పాల్గొన్నారు. అక్కడ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో క్యాంస్య పతకం కైవసం చేసుకున్నారు. 

3 /9

సైనా నెహ్వాల్ లండన్ ఒలింపిక్స్ 2012 ఆటల్లో పాల్గొన్నారు. ఆమె ఈ ఆటల్లో బ్రాంజ్ ను గెలుచుకుని భారతకీర్తిని ఎవరెస్ట్ అంత ఎత్తుకు తీసుకెళ్లారు.   

4 /9

బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ కూడా లండన్ ఒలింపిక్స్ 2012 లో పాల్గొని తనసత్తా చాటారు. ఈ ఒలింపిక్స్ లో.. మెరీకోమ్ బ్రాంజ్ ను కైవసం చేసుకున్నారు.

5 /9

హైదరాబాద్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీ. వీ. సిందూ రియో  ఒలింపిక్స్ 2016, టోక్యో ఒలింపిక్స్ లో 2020 పాల్గొన్నారు. ఈ ఆటల్లో.. వరుసగా సింధూ కాంస్య పతకం సాధించారు.

6 /9

అదే విధంగా... రియో ఒలింపిక్స్ 2016 లొ పాల్గొన్న సాక్షి మాలిక్ తనదైన స్టైల్ లో సత్తాచాటారు. రెజ్లింగ్ విభాగంలో..  బ్రాంజ్ ను కైవసం చేసుకున్నారు.

7 /9

మీరాబాయ్ చాను వెయిట్ లిఫ్టింగ్ లోసత్తా చాటారు. ఆమె టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ లో.. 2020 లో సిల్వర్ పతకం కైవసం చేసుకున్నారు.   

8 /9

లవ్లీనా బొర్గహైన్.. బాక్సింగ్ విభాగంతో తనదైన ప్రతిభకనబర్చారు.ఆమె టోక్యోలో 2020 జరిగిన  ఒలింపిక్స్ లో పాల్గొని బ్రాంజ్ పతకం కైవసం చేసుకున్నారు.  

9 /9

ప్రస్తుతం పారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్ లో మనూబాకర్ తన సత్తాచాటుతున్నారు. ఎయిర్ షూటింగ్ విభాగంలో ఇప్పటికే మొదటి బోణి కొట్టిన మనూబాకర్, డబుల్స్ లో మరోసారి పతకం సాధించారు. రెండు కాంస్య పతకాలు సాధించుకున్నారు.