Ashada Amavasya 2024 Remedy: ఆషాఢ అమావాస్యరోజు కొన్ని పనులు చేయాలి, మరికొన్ని పనులు చేయకుండా జాగ్రత్త పడాలి. రేపు అరుదైన ఆషాఢ అమావాస్య సందర్భంగా కొన్ని పనులు చేయకుండా ఉండాలి లేదంటే దరిద్రం పట్టుకుంటుంది. ఆ పనులు ఏంటో తెలుసుకుందాం.
అమావాస్య రోజు సూర్యోదయానికి ముందే లేచి తలస్నానం చేయాలి. పొరపాటున కూడా ఈరోజు గోళ్లు కత్తిరించకూడదు, జుట్టు కట్ చేయకూడదు. ఈరోజు రాత్రి తినకూడదు. కేవలం మధ్యాహ్నం తినాలి. అంతేకాదు ఈరోజు కొత్త బట్టలు అస్సలు ధరించకూడదు. మధ్యాహ్నం పూట అస్సలు నిద్ర పోకూడదు.
పేదలకు అన్నదానం చేస్తే మరీ మంచిది. స్నానం చేసిన తర్వాత పితృదేవతలకు దక్షిణం వైపు తిరిగి కుడిచేతిలో నల్లనువ్వులతో తర్పణం వదలాలి. ఈరోజు లక్ష్మిదేవిని కచ్చితంగా పూజించాలి. ఆవు నెయ్యి దీపం వెలిగించాలి.
ఈ రోజున మనం సూర్యుడుకి నీటిని సమర్పిస్తాం. ప్రతి ఆదివారం కూడా ఇలా చేయడం వల్ల మీ మేధస్సు పెరుగుతుంది. అంతేకాదు మీరు శక్తివంతంగా కూడా మారతారు.
అమావాస్య రోజు సాయంత్రం గుడికి వెళ్లి నెయ్యి దీపం వెలిగించాలి. మీ ఇంటికి దగ్గరలోని ఏదైనా ఆలయంలో నెయ్యి దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల కూడా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి..
మనం అన్నదానం చేస్తే మన పూర్వీకులు ఏదో ఒక రూపంలో స్వీకరిస్తారు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)