Ravi Teja: సినిమాల్లోకి రాకముందు ఆ నటి ఇంట్లో అద్దెకున్న రవితేజ.. ఆమెను మా ఇంటి ఆవిడ అని చెప్పేవారట..!

Ravi Teja: సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు రవితేజ.  అయితే అలాంటి సమయంలో ప్రముఖ నటి అనురాధ ఇంట్లో అద్దెకు ఉండేవారట. ఆ ఇంటి నుంచి అవకాశాల కోసం వెతికి ఇప్పుడు స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఆమె కనిపించిన ఆమెను ఆప్యాయంగా పలకరిస్తారట రవితేజ. 

1 /5

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ఆరు పదుల వయసుకు చేరువలో ఉన్నా  వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.  సినీ ఇండస్ట్రీలోకి రావాలనుకున్న ఆయన మొదటి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరి,  ఆ తర్వాత సెకండ్ హీరోగా నటించారు.అంతేకాదు  అవకాశాల కోసం విలన్ పాత్రలు కూడా చేశారు. ఇక ఇప్పుడు స్టార్ హీరో అయిపోయారు. ఇదిలా ఉండగా ఈయన ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కొత్తలో ఒక ఇంట్లో అద్దెకు ఉండేవారట. ఆ సమయంలో ఆ ఇంటి ఓనర్ రవితేజ తనతో ఎలా ప్రవర్తించారు అనే విషయాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.  

2 /5

ఆమె ఎవరో కాదు ప్రముఖ నటి అనురాధ. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అనురాధ గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా ఈమె ఇండస్ట్రీలో ఎంత పేరు సంపాదించుకుందో తన ఇంటికి కూడా అంతే పేరు తీసుకొచ్చింద.. దానికి కారణం ఆ ఇంటి అదృష్టమే ముఖ్యంగా ఆ ఇంట్లో ఉండే చాలా మంది ఇప్పుడు స్టార్ సెలబ్రిటీలు గా కొనసాగుతున్నారు. 

3 /5

ముఖ్యంగా కృష్ణ భగవాన్,  రవితేజ,  వైవిఎస్ చౌదరి,  శివాజీ రాజా , డైరెక్టర్ గుణశేఖర్ వీరంతా కూడా అనురాధ ఇంట్లోనే అద్దెకు ఉండేవారట. ఇప్పుడు వీరంతా ఏ స్థాయిలో ఉన్నారో అందరికీ తెలిసిందే. 

4 /5

అనురాధ మాట్లాడుతూ.. ‘మా ఇంటి ఫ్రంట్ పోషన్లో మేము ఉంటే.. బ్యాక్ పోషన్లో..  వారు ఉండేవారు. వీరంతా కూడా అక్కడినుంచి సినిమా షూటింగ్లకు వెళ్ళేవారు. ముఖ్యంగా మా ఇంటి నుంచి వెళ్లిన ప్రతి ఒక్కరు కూడా చాలా పెద్ద వాళ్ళు అయిపోయారు. ఇక రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆయన నన్ను చూసిన ప్రతిసారి మా ఇంటి ఆవిడ అంటూ అందరితో చెప్పేవాళ్ళు. అందరూ ఆశ్చర్యంగా చూస్తే మాత్రం మా ఇంటి ఓనర్ అండి.. ఆమె ఇంటి నుండి నేను.. ఈ స్థాయికి వచ్చాను అని,  అందరితో చెబుతూ ఉంటారు. ఆయన ఇంత పెద్ద స్టార్ అయినప్పటికీ కూడా ఇంకా నన్ను గుర్తు పెట్టుకున్నారు అంటే అది చాలా గొప్ప విషయం’ అంటూ తెలిపింది అనురాధ.

5 /5

మా ఇంట్లో ఉన్నప్పుడు ఫోటోలు పట్టుకొని ఇండస్ట్రీలో అవకాశాల కోసం తిరిగేవారు. అలాంటి ఆయన ఇప్పుడు స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకొని ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా గుర్తుపెట్టుకుని పలకరిస్తూ ఉంటే సంతోషంగా ఉంది అంటూ తెలిపింది. మొత్తానికి అయితే రవితేజ గొప్పతనాన్ని మరొకసారి గుర్తు చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు అనురాధ.