Central Government Hike Pesions: సూపర్ సీనియర్ సిటిజన్ పెన్షన్ దారులకు కేంద్ర ప్రభుత్వ భారీ శుభవార్త అందించే అవకాశం కనిపిస్తోంది. కారుణ్య భృతి పేరుతో అదనపు పెంచేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే పెన్షన్ల పెంపునకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
సూపర్ సీనియర్ సిటిజన్లకు అంటే 80 ఏళ్లు పైబడిన పెన్షన్ దారులకు కేంద్రం అదనపు పెన్షన్ అందజేయనుంది. 80 నుంచి 85 ఏళ్ల వయస్సు ఉన్న వారికి బేసిక్ పెన్షన్‌లో 20 శాతం పెంపు ఉండనుంది.
ఇక 85 నుంచి 90 ఏళ్ల వయస్సు ఉన్న పెన్షన్‌దారులకు బేసిక్ పెన్షన్‌లో 30 శాతం పెంపు ఉంటుంది.
90 నుంచి 95 ఏళ్ల మధ్య ఉన్న వారికి పెన్షన్‌లో 40 శాతం పెంపు అందుకోనున్నారు. 95 నుంచి 100 ఏళ్ల పెన్షన్‌దారులకు 50 శాతం పెంపు ఉండనుంది.
ఉదాహరణకు ఆగస్టు 1, 1942న జన్మించిన పెన్షన్‌దారులు ఆగస్టు 1, 2022 నుంచి బేసిక్ పింఛన్లో 20 శాతం అదనపు పెన్షన్ పొందేందుకు అర్హులు అవుతారు.
పింఛన్‌దారులు నిర్ణీత వయస్సును చేరుకున్న మొదటి రోజు నుంచే అదనపు పెన్షన్ పొందేందుకు అర్హులు అవుతారని పెన్షనర్స్ సంక్షేమ శాఖ నోటిఫికేషన్లో వెల్లడించింది.
పెన్షన్ పంపిణీలో పాల్గొన్న అన్ని శాఖలు, బ్యాంకులు కొత్త మార్గదర్శకాలపై పెన్షన్‌దారులకు అవగాహన కల్పించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో పెన్షన్‌దారులు త్వరగా లబ్ధిపొందేందుకు అవకాశం ఉంటుంది.