Tips For Good Relationship: ఎప్పటికీ కలిసి ఉండాలి అనుకుంటున్నారా.. అయితే ఇలా చేయాల్సిందే..!

Happy Marriage Tips :భార్యాభర్తల మధ్య మాట పట్టింపులు, చిన్నపాటి తగాదాలు చాలా సహజమే. అయితే కొన్ని సందర్భాలలో ఇవి శృతి మించినప్పుడు తెలియకుండా వారి మధ్య పెద్ద అగాధంగా మారుతాయి. మీ సంసారంలో అటువంటి ఒరిదుడుకులు లేకుండా సజావుగా ఉండాలి అంటే ఈ నాలుగు చిన్నపాటి టిప్స్ పాటిస్తే సరిపోతుంది..

1 /5

భార్యాభర్తల మధ్య చిలిపి తగాదాలు.. ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఈ చిలిపి తగాదాలు కాస్త హద్దు దాటితే జీవితాన్ని తలకిందులుగా చేస్తాయి. అందుకే ఇద్దరి మధ్య మనస్పర్ధలకి.. గొడవలకి వీలైనంతగా చెక్ పెడితేనే రిలేషన్షిప్ సజావుగా ముందుకు సాగుతుంది. కొన్ని సందర్భాలలో ఒకరిపై ఒకరికి ఎంత ప్రేమ ఉన్నా మనసు విప్పి మాట్లాడకపోవడం అనేది పెద్ద ప్రమాదంగా మారుతుంది. మరి మీ సంసారం ఎటువంటి చికాకులు లేకుండా ఆనందంగా ఉండాలి అనుకుంటే ఏం చేయాలో తెలుసుకుందాం పదండి..

2 /5

మనం కోపంగా ఉన్నప్పుడు తెలియకుండానే చాలా కటువుగా మాట్లాడుతాం. ఆ తర్వాత క్షమాపణ చెప్పిన సరే మనం అన్న మాటల్ని వెనక్కి తీసుకోలేము కదా. ఇది ఒక భర్తకో లేక భార్యకో పరిమితం కాదు. ఎవ్వరైనా సరే కోపంగా ఉన్నప్పుడు అస్సలు మాట తూలకండి. ఒకరిపై ఒకరు తిట్టుకుంటూ మెసేజ్లు కూడా పెట్టుకోకండి. వీటివల్ల గొడవలు పెద్దవి.. అవుతాయే తప్ప తగ్గవు. 

3 /5

గొడవ జరిగినప్పుడు ఎవరిదో ఒకరిదే తప్పు అన్న ధోరణి సరికాదు. మనం ఎలా అవతలి వారు మనల్ని అర్థం చేసుకోవాలి అనుకుంటామో..అటు నుంచి కూడా అదే ఆశిస్తారు అని మరిచిపోకండి. మీ పార్ట్నర్ ఏమి చెప్పదలుచుకున్నారు అన్న విషయాన్ని.. మొదట ప్రశాంతంగా వినండి. అందులో మీకు నచ్చని అంశాలు ఉంటే సున్నితంగా చర్చించండి. మొదట్లో ఇలా చేయడం వల్ల పెద్దగా ఫలితం ఉండకపోయినా క్రమేనా మీ బంధం బలపడుతుంది.  

4 /5

సహజంగా భార్యాభర్తలు గొడవ పడినప్పుడు వేరే వారి గురించి కూడా ప్రస్తావిస్తూ ఉంటారు. భార్య అత్తగారి తరఫువారిని తిట్టిపోస్తే.. భర్త భార్య పుట్టింటి వాళ్లను ఎద్దేవా చేస్తాడు. అయితే ఇలా చేయడం వల్ల మీ మధ్య మీరే మనస్పర్ధలు సృష్టించుకున్న వాళ్ళు అవుతారు. మన సంసారంలో మనం ఏమనుకుంటున్నాం అనేదే ముఖ్యం తప్ప బయట వాళ్ల ప్రమేయం ఉండకూడదు అని భార్యాభర్తలు ఇద్దరు గట్టిగా అనుకోవాలి. అప్పుడే బయట నుంచి ఎవ్వరు మీ ఇద్దరి మధ్య దూరలేరు.

5 /5

ప్రతి మనిషిలో ఏదో ఒక చెడు ఉండనే ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరూ వేరువేరు మనస్తత్వాలు కలిగిన వారు కాబట్టి ఒకే రకంగా ఆలోచించాలి, ఒకే రకంగా ఉండాలి అంటే కుదరని పని. మీ జీవిత భాగస్వామిలో మంచిని ఎక్కువగా గుర్తు పెట్టుకొని చెడును వదిలేయడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ బంధం బలపడడంతో పాటు ఎటువంటి గొడవలు తలెత్తకుండా ఉంటాయి.