Venus Transit 2024 In Telugu: శుక్రుడు ఏ రాశిలోనై 1 నెల లేదా 26 రోజుల పాటు ఉంటుంది. ఆ తర్వాత ఈ గ్రహం ఒక రాశి మరో రాశికి సంచారం చేస్తుంది. ఈ సంచారం మానవ జీవితంపై ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపుతుంది. ఈ రాశి జాతకంలో శుభ స్థానంలో ఉన్నవారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. అదే ఈ రాశి అశుభ స్థానంలో ఉండే అనేక సమస్యలు వస్తాయి.
శుక్రుడు ఇప్పుడు ఉత్తర ఫాల్గుణి నక్షత్రంలో ఉంది. అయితే త్వరలోనే హస్తా నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది. దీని కారణంగా సెప్టెంబర్ 2వ తేదీన నుంచి కొన్ని రాశులవారికి ప్రత్యేకమైన ప్రభావం ఏర్పడి జీవితాల్లో మార్పులు వస్తాయి.
శుక్రుడు నక్షత్ర సంచారం చేయడం వల్ల సింహ రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి అన్ని పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. దీంతో పాటు కొత్త ఆదాయ వనరులు కూడా ఏర్పడతాయి. అలాగే డబ్బు ప్రవాహం కూడా పెరుగుతుంది.
ఈ రాశివారికి ఆదాయం పెరడం వల్ల డబ్బులు కూడా పొదుపు చేసే ఛాన్స్‌లు ఉన్నాయి. వ్యాపారాలు చేసేవారికి విపరీమైన ధన లాభాలు కలుగుతాయి. దీంతో పాటు కొన్ని శుభ వార్తలు కూడా వింటారు.
శుక్రుడి సంచారం కన్యా రాశివారికి కూడా ఎంతో లాభదాయకంగా ఉంటుంది. దీంతో పాటు వీరు ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. దీంతో పాటు ఉద్యోగాలు చేసేవారికి కూడా ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుంది.
శుక్రుడి సంచారం కారణంగా శత్రువుల నుంచి కూడా సులభంగా విముక్తి లభిస్తుంది. అలాగే ఉద్యోగాలు చేసేవారికి సీనియర్స్ నుంచి సపోర్ట్ లభించి ఊహించని ప్రశంసలు పొందుతారు. ఆర్థిక సమస్యలు కూడా దూరమవుతాయి.
శుక్రుడి సంచారం మకర రాశివారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి అదృష్టం సహకరిస్తుంది. దీని వల్ల ఎలాంటి పనులు చేసిన అనేక లాభాలు పొందుతారు.
ఉద్యోగాలు చేస్తున్న మకర రాశివారికి సులభంగా ప్రమోషన్స్ లభిస్తాయి. అంతేకాకుండా వ్యాపారాలు కూడా అనుకున్నట్లు జరుగుతాయి. దీంతో పాటు ఆకస్మికంగా ఊహించని ధన లాభాలు కలుగుతాయి.