Paralympics 2024: చరిత్ర సృష్టించిన అమ్మాయిలు.. ఒకే రోజు భారత్ కు స్వర్ణం, రజతం, కాంస్యం.. డిటెయిల్స్ ఇవే..

Avani lekhara:  పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ కు చెందిన అథ్లేట్ లు సత్తాచాటారు. మన దేశానికి ఒక రోజున మూడు పతాకాలు సాధించి రికార్డు క్రియేట్ చేశారు. దేశానికి తొలి బంగారు పతకంను అవనీ సాధించింది.
 

1 /6

పారిస్ పారాలింపిక్స్ 2024 క్రీడలు జరుగుతున్నాయి. ఈనేథ్యంలో మరోమారు భారత్ అథ్లేట్ లు సత్తా చాటారు. భారత స్టార్ పారా షూటర్ అవనీ లేఖరా స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. పారాలింపిక్స్‌లో అవనీ వరుసగా రెండోసారి బంగారు పతకం సాధించి రికార్డు క్రియేట్ చేసింది.

2 /6

మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ (SH 1) విభాగంలో అవని మొదటి స్థానంలో నిలవగా, ఇదే ఈవెంట్‌లో భారత్‌కు చెందిన మరో పారా షూటర్ మోనా అగర్వాల్ కాంస్య పతకాన్ని గెల్చుకుంది. వీరితో పాటుగా.. పరుగు పందెంలో ప్రీతీపాల్ స్ప్రింటర్ కాంస్యం మూడో పతకం గెలుచుకుంది.

3 /6

ఈ నేపథ్యంలో భారత్ కు పారిలింపిక్స్ లో భారత్ కు ఒకే రోజు మూడు పతకాలు దక్కినట్లు తెలుస్తోంది. మోనా అగార్వాల్.. ఫైనల్‌లో మోనా 228.7 స్కోరుతో కాంస్య పతకాన్ని గెలుచుకోగా, ఫైనల్‌లో అవనీ 249.7 స్కోర్ చేసింది. మూడేళ్ల క్రితం కూడా.. టోక్యో పారాలింపిక్స్‌లో కూడా అవనీ గోల్డ్ పతకంను గెలుచుకుంది.  

4 /6

ప్రీతిపాల్.. మహిళల 100 మీల. టీ35 విభాగం ఫైనల్ లో.. మూడో స్థానం దక్కించుకుంది. ఈ రేసును.. 14.21 సెకన్లలో ముగించారు. దీంతో ఆమె కాంస్యం గెల్చుకుంది. ప్రీతిపాల్ యూపీలోని ముజఫర్ నగర్ లో  రైతు కుటుంబంతో జన్మించింది.

5 /6

మరోవైపు.. ఎయిర్ రైఫిల్ 10 మీటర్ల  విభాగంలో రాజస్థాన్ అమ్మాయి.. అవనీ లేఖరాకు ఫిబ్రవరి 20, 2012 ఎప్పటికీ గుర్తుంచుకునే తేదీ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆమె కుటుంబం జైపూర్ నుంచి రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌కు వెళుతుండగా కారు ప్రమాదానికి గురైంది. అప్పుడు  ఆమె వెన్నుముక దెబ్బతింది. దీంతో ఆమె నడుము భాగం పక్షవాతానికి గురైంది. కానీ కష్టపడి వీల్ చైర్‌పై పాఠశాలకు వెళ్లడం ప్రారంభించి విద్యను అభ్యసించింది. తండ్రి ప్రోత్సహాంతో..షూటింగ్ లో కష్టపడి ప్రాక్టిస్ చేసింది.  

6 /6

తండ్రి ప్రవీణ్ ప్రొత్సాహాంతో, సవాళ్లను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చింది. అప్పుడే ఆమె అభినవ్ బింద్రా ఆత్మకథ ఎ షాట్ ఎట్ హిస్టరీ మై అబ్సెసివ్ జర్నీ టు ఒలింపిక్ గోల్డ్‌ పుస్తకాన్ని చదివి ప్రేరణ పొందింది. ఈ నేపథ్యంలో అవనీ వీల్‌చైర్‌ను ఉపయోగించి షూటింగ్‌లో SH1 విభాగంలో పాల్గొంది. దీనిలో చేతులు, దిగువ మొండెం, కాళ్ల కదలికలు ప్రభావితం అయిన వారు ఉంటారు.