Vinayaka Chaturthi 2024: వినాయక చవితి ఒక్కరోజే గణపతికి తులసీదళం.. మిగతరోజుల్లో నిషేధం.. ఈ శాపం గురించి తెలుసా..?

Tulasi cursed Vinayaka story: వినాయక చతుర్థిని ప్రజలు ఎంతో భక్తితో జరుపుకుంటారు. ఈసారి సెప్టెంబర్ 7 న గణేషుడి చతుర్థిని జరుపుకోబోతున్నాం. ఇదిలాఉండగా..  వినాయకుడికి తులసీదేవీ ఒక శాపం ఇచ్చిందంట. 
 

1 /7

భాద్రపద మాసంలో చతుర్థిరోజున వినాయక చతుర్థిగా జరుపుకుంటారు. ఈరోజున దేశమంతాట కూడా వినాయకుడి విగ్రహాలను ప్రతిష్టాపన చేసుకుంటారు. కొంత మంది..  3, 5,11 రోజులు.. ఇలా వారి ఇంట్లో ఆచారంను బట్టి పాటు వినాయకులను ప్రతిష్టాపని చేసుకుని పూజించుకుంటారు. 

2 /7

అయితే.. గణపయ్యకు ఎర్రని పువ్వు, ఏకాదశ పత్రాలు, ఉండ్రాళ్లపాశం, కుడుములు, మోదకాలు నైవేద్యంగా సమర్పించుకుంటారు. అయితే.. ఏడాదికి ఒక్కరోజు మాత్రం..గణషుడి పూజలో తులసీ దళంను ఉపయోగిస్తారు. మిగతా రోజులలో మాత్రంఅస్సలు ఉపయోగించరు. దీని వెనుక ఒక కథ ప్రాచుర్యంలో ఉంది.

3 /7

తులసీ దళాలను గణపతికి వాడక పోవడానికి పురాణాలలో ఒక కథ ప్రాచుర్యంలో ఉంది.. పూర్వం.. హంసధ్వజుని పుత్రుడైన ధర్మధ్వజునికి విష్ణువు అనుగ్రహాం వలన కలిగిన సంతానమే తులసి. ఈమె గంగా నదీ తీరంలో విహరిస్తున్నప్పుడు అటుగా వచ్చిన గణపతిని చూచి మోహిస్తుంది. తనను వివాహం చేసుకొమ్మని గణపతిని అడుగుతుంది.

4 /7

కానీ గణపయ్య మాత్రం ఆమెను అస్సలు పట్టించుకోడు. దీంతో కోపంతో.. తులసీ..నన్నే పట్టించుకోవా.. ‘దీర్ఘకాలం బ్రహ్మచారిగానే ఉండిపొమ్మ’ని గణపతిని శపిస్తుంది. దీంతో వినాయకుడు అకారణంగాత.. తనకు శాపం ఇచ్చిన తులసీకి కూడా..  ‘రాక్షసునికి జీవితాంతం బందీగా ఉండిపొమ్మని’ తులసీకి ప్రతిశాపం ఇస్తాడు. అప్పటి నుంచి గణపయ్య పూజలో తులసీ ఉపయోగించరు.  

5 /7

ఇది మాత్రమే కాకుండా.. మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది.. తులసి బ్రహ్మదేవుని వరంతో శంఖచూడుడనే రాక్షసున్ని పెళ్లి చేసుకుంటుంది.  కృష్ణ కవచం ఉందనే గర్వంతో దేవతలందరినీ అతడు బాధిస్తుంటాడు. 

6 /7

తులసీదేవి పాతివ్రత్య మహిమతో అతణ్నెవరూ జయించ లేకపోతారు. వినాయకుని సాయంతో ఆమె పాతివ్రత్యానికి భంగం వాటిల్లేలా చేసి రాక్షసుడిని  విష్ణు దేవుడు సంహరిస్తాడు. ఆ తర్వాత శ్రీహరి వరంతో తులసి.. మొక్కగా అవతరిస్తుంది.   

7 /7

తన పాతివ్రత్యాన్ని భంగం చేయడానికి సహకరించిన గణపతిని ‘శిరస్సు లేకుండుగాక’ అని తులసి శపిస్తుందంట. తనను శపించిందన్న కోపంతో తెలసి సాన్నిహిత్యాన్ని సహింపనని చెబుతాడు గణపతి. వినాయక చవితి రోజు మాత్రం మినహాయింపు ఉందని బ్రహ్మవైవర్త పురాణం చెబుతుంది. అందుకే, వినాయకచవితి రోజు మినహా మరేరోజూ వినాయకుడికి తులసీని పూజలో ఉపయోగించరు.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)