Ganesh Chaturthi 2024: వినాయక చవితి రోజు చంద్రుడ్ని చూశారా..?.. ఈ రెండు పరిహారాలు పాటిస్తే శాపం కాస్త వరంగా మారుతుంది..

Ganesh curses moon story: వినాయక చవితిని ఘనంగా జరుపుకొవడానికి ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది.. సెప్టెంబర్ 7 న గణేష్ చవితి పండుగను  నిర్వహిస్తారు.
 

1 /6

వినాయక చవితిని దేశమంతాట ఘనంగా జరుపుకుంటారు. ఇప్పటికే ప్రతి చోట రోడ్డు మీద వినాయక విగ్రహాల అమ్మకాలు జోరందుకున్నాయి. కొంత మంది పీఓపీ విగ్రహాలు అమ్ముతుంటే.. మరికొందరు మాత్రం ఎకో ఫ్రెండ్లీ గణేషుడ్ని ప్రతిష్టిస్తారు. 1,3,5,9,11 ఇలా.. వాళ్ల ఆచారంను బట్టి గణపయ్యను పూజించుకుంటారు.

2 /6

అయితే.. వినాయక చవితి రోజు గణపయ్యను మండపంలో భక్తితో ప్రతిష్టాపన చేసుకుంటారు. అంతేకాకుండా.. ప్రత్యేకంగా మోదకాలు, ఉండ్రాళ్లను నైవేద్యంగా పెడుతుంటారు.ఈ నేపథ్యంలో.. గణపయ్య చవితిరోజున చందమామను చూడొద్దని చెప్తుంటారు. దీని వెనుక అనేక ఇతిహాసాలు ప్రచారంలో ఉన్నాయి.

3 /6

ఒకసారి బొజ్జ గణపయ్య.. కైలాసానికి ఉండ్రాళ్లు తిని వస్తాడంట.  అప్పుడు.. బొజ్జ గణపయ్య కైలాసానికి వచ్చినప్పుడు.. శివుడు, పార్వతి అమ్మవార్లకు దండంపెట్టుకునేందుకు.. కిందకు వంగుతాడంట. అప్పుడు ఒక్కసారిగా.. శివయ్య తల మీద ఉన్న.. చంద్రుడు గణేషుడిని చూసి నవ్వుతాడంట. దీంతో ఆయన పొట్ట ఒక్కసారిగా పగిలిపోతుంది. దీంతో పార్వతి అమ్మవారికి కోపం వస్తుందంట.  

4 /6

తన పుత్రుడ్ని చూసి నవ్వినందుకు చంద్రుడికి కోపంతో శాపం ఇస్తుంది. చంద్రుడ్ని చూసిన వాళ్లకు నీలాప నిందలు వస్తాయని కూడా శపించింది. దీంతో చంద్రుడు తన తప్పును తెలుసుకొని పరిహారం చెప్పమని కోరడంతో.. కేవలం వినాయక చవితి రోజు మాత్రం చంద్రుడిని చూసిన వాళ్లకు మాత్రం దోషం వస్తుందని శాపానికి కొన్ని పరిహారాలను అమ్మవారు చెప్తారు.  

5 /6

వినాయక చతుర్థిరోజున.. భక్తితో స్వామి వారిని ప్రతిష్టించి, ఆ తర్వాత శమంతోపాఖ్యానం, వినాయకుడి ఆవిర్భావం కథను భక్తితో విని, ఆ తర్వాత ఆ అక్షింతలను తనపై వేసుకుంటే కూడా చంద్రుడిని చూసిన దోషం ఉండదు.  

6 /6

అంతేకాకుండా.. నాగ చతుర్థిరోజున చాలా మంది జొన్న ప్యాలాలతో నవనాగులకు పూజలు చేస్తుంటారు. ఈ పూజలు చేసిన జోన్నలను జాగ్రత్తగా దాచుకుని, చంద్రుడ్ని చూసిన వాళ్లు వినాయకచవితి రోజునతింటే దోషంసమస్య ఉండదని పండితులు చెబుతున్నారు.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)